Punjab election 2022: ఎల్లుండి పోలింగ్... సిక్కు ప్రముఖులతో ప్రధాని మోడీ కీలక భేటీ

Siva Kodati |  
Published : Feb 18, 2022, 03:40 PM IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సిక్కు నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత మన్‌జీందర్ సింగ్ సిర్సా సారథ్యంలో వారంతా ప్రధాని మోడీని కలిశారు.

PREV
19
Punjab election 2022: ఎల్లుండి పోలింగ్... సిక్కు ప్రముఖులతో ప్రధాని మోడీ కీలక భేటీ
modi

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు (five state elections) సంబంధించి కీలకమైన పంజాబ్‌లో (punjab poll 2022)  ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచారానికి ఇవ్వాళే చివరి రోజు. ఈ సాయంత్రానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.

29
modi

ఎల్లుండి పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పంజాబ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశలో 59 నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. 
 

39
modi

ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) - సిక్కు (sikh) వర్గానికి చెందిన కొందరు ప్రముఖులతో శుక్రవారం సమావేశం అయ్యారు. రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధాని వారితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత మన్‌జీందర్ సింగ్ సిర్సా సారథ్యంలో వారంతా ప్రధాని మోడీని కలిశారు.

49
modi

ఢిల్లీలోని నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల మోడీ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇంటి ఆవరణలో వారంతా మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీకి తమ సిక్కు సంప్రదాయబద్ధమైన స్కార్ఫ్‌ను ఆయన తలకు చుట్టారు. అది కాషాయరంగులో ఉన్న స్కార్ఫ్ కావడం గమనార్హం. 

59
modi

అయితే వీరంతా మోడీని ఎందుకు కలిశారు అనడానికి సరైన కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలోనే బీజేపీ నేత సిర్సా- వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

69
modi

ప్రధాని మోడీని కలిసిన వారిలో- ఢిల్లీ గురుద్వార కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచెవాల్, సేవాపంథీ అధ్యక్షుడు మహంత్ కరమ్‌జీత్ సింగ్, డేరాబాబా జంగ్ సింగ్, బాబా జోగా సింగ్, సంత్ బాబా మేజర్ సింగ్ వా, ముఖి డేరాబాబా తారా సింగ్ వా, జథేందర్ బాబా సాహిబ్ సింగ్‌జీ, సురీందర్ సింగ్, బాబా జస్సా సింగ్, శిరోమణి అకాలీ బుధ దాల్, డాక్టర్ హర్భజన్ సింగ్, సింగ్ సాహిబ్ జ్ఞాని రంజీత్ సింగ్, జథేందర్ తఖ్త్ ఉన్నారు.

79
modi

కాగా.. పంజాబ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు గాను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

89
modi

కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 24,689 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

99
modi

పంజాబ్‌‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్,అధికారాన్ని అందుకోవాలని ఆప్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి

Read more Photos on
click me!

Recommended Stories