pm modi had lunch with fellow mps in parliament canteen
Parliament Canteen: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం లభించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షఎంపీలు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, స్కాములపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు క్యాంటీన్‌లో లంచ్ చేశారు. తోటి ఎంపీలతో కలిసి ఆయన భోజనం చేశారు.
pm modi had lunch with fellow mps in parliament canteen
పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని మోడీతో లంచ్ కోసం పీఎం ఆహ్వానించినట్టు తెలిసింది.
బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు ప్రధానమంత్రితో లంచ్‌లో పాల్గొన్నారు.
pm modi had lunch with fellow mps in parliament canteen
ఈ ఎంపీలకు మధ్యాహ్నం 2.30 గంటలకు ఫోన్‌లో ప్రధాని మోడీతో ఈ లంచ్ గురించి సమాచారం అందింనట్టు తెలిసింది.
ఆ ఎంపీలతో ప్రధాని మోడీ.. ‘చలో.. ఇప్పుడు మీకు ఓ పనిష్‌మెంట్ ఇవ్వాల్సి ఉన్నది’ అని కామెడీగా పేర్కొన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
pm modi had lunch with fellow mps in parliament canteen
ప్రధానమంత్రి మోడీ, ఆ ఎంపీలు క్యాంటీన్‌లో శాకాహార భోజనం చేసినట్టు తెలిసింది. రాగి లడ్డూలు తిన్నట్టు సమాచారం.