మోడీ పుట్టినరోజు స్పెషల్: ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఇదే

Published : Sep 16, 2024, 11:46 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ ఏట అడుగుపెడుతున్నారు. సెప్టెంబర్ 17న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఈ వయసులో కూడా ఆయనను ఇంత చురుగ్గా వుంటున్నారంటే ఇందుకు ఆయన ఆహార అలవాట్లే కారణం. కాబట్టి ప్రధాని మోదీ ఆహార అలవాట్ల గురించి తెలుసుకుందా. 

PREV
16
మోడీ పుట్టినరోజు స్పెషల్: ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఇదే
మోడీ ఆహార అలవాట్లు

సెప్టెంబర్ 17 మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.  ఆయన 73 ఏళ్లను పూర్తిచేసుకుని 74వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ వయసులోనూ ఆయన అద్భుతమైన శక్తి, చురుకుదనం చూస్తుంటే నవ యువకుడిలా అనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రధాన మంత్రి మోడీ పర్పెక్ట్ ఉదాహరణ. తన ఆరోగ్యానికి ఆహార అలవాట్లు కారణమని ఆయనే తరచుగా చెబుతుంటారు. ఉదయం యోగ, ధ్యానంతో ప్రారంభమయ్యే ఆయన దినచర్య రాత్రి పడుకునే వరకు చాలా క్రమశిక్షణగా వుంటుంది. తనను చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకునే నియమాలను మోదీ అనుసరిస్తారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడే ఆహార అలవాట్లను పరిశీలిద్దాం.

2021 ఏప్రిల్‌లో మోడీ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. దీనిలో ఆవిరి పువ్వులు, ఆవిరి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు.

26
మోడీ ఆహార అలవాట్లు

ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం అల్పాహారంలో తాజా పండ్లు, కూరగాయలు తింటారు. ఉదయం 9 గంటలలోపు ఆయన అల్పాహారం ముగించుకుంటారు.  

36
మోడీ ఆహార అలవాట్లు

పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్‌ మాటల్లో... రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రతిరోజూ పసుపు తినాలని తన తల్లి ఎప్పుడూ చెబుతుండేదని ప్రధాన మంత్రి మోడీ అన్నారట.  అందుకే ఆయన తినే ఆహార పదార్థాల్లో పసుపు సమపాళ్లలో వుటుందట. 

46
మోడీ ఆహార అలవాట్లు

2019 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టమని మోడీ అన్నారు. చిన్నతనంలో చెట్లనుండి మామిడి పళ్ళను కోసుకొని తినేవాడినని ఆయన చెప్పారు.

56
మోడీ ఆహార అలవాట్లు

2020 ఫిబ్రవరిలో, ఆయన ఢిల్లీ హునర్ హాట్‌కు వెళ్ళినప్పుడు, ప్రసిద్ధ బీహారీ వంటకం లిట్టి చోఖాను రుచి చూసిన తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను రుచికరమైన లిట్టి చోఖా తిన్నాను" అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

66
మోడీ ఆహార అలవాట్లు

ఖిచిడీ అంటే తనకు చాలా ఇష్టమని మోడీ సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. మోడీకి ములక్కాడ పెరుగు అన్నం కూడా ఇష్టమని చెబుతారు. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. జలుబు, జ్వరం వంటి వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.

click me!

Recommended Stories