లాక్‌డౌన్ ఎఫెక్ట్: 600 కి.మీ. సైకిల్‌పైనే, అరటిపండ్లే ఆహారం

First Published May 5, 2020, 10:36 AM IST

లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు చేరుకొనేందుకు వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు సైకిల్ పై హర్యానా నుండి తమ గ్రామానికి బయలుదేరారు.

లాక్ డౌన్ నేపథ్యంలో 600 కి.మీ దూరంలోని తమ స్వంత గ్రామానికి ఇద్దరు వలస కార్మికులు సైకిల్ పై చేరుకొన్నారు. అర్ధాకలితోనే వీరిద్దరూ సైకిల్ పై స్వంత ఊరికి బయలుదేరారు.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంది. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ గ్రామాలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. కొందరైతే తమ గ్రామాలకు చేరుకొనేందుకు కాలినడకన బయలుదేరారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి.
undefined
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా గ్రామానికి చెందిన శివం రాథోడ్, రామానంద్ రాథోడ్ లు భవన నిర్మాణ కార్మికులు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో ఎనిమిది అంతస్థుల భవన నిర్మాణ ప్రాజెక్టులో ఈ ఏడాది మార్చి 19న వీరు చేరారు. రోజుకు రూ. 400 కూలీ. ఈ భవన నిర్మాణ పనుల్లో చేరేందుకు ఇదే గ్రామానికి చెందిన పలువురు కూలీలుగా చేరారు.
undefined
వర్షాకాలం నాటికి భవన నిర్మాణాలు అంతగా ఉండవు. వర్షాకాం ప్రారంభం నాటికి కొంత డబ్బులను సంపాదించి ఇంటికి చేరుకోవాలని వీరు భావించారు. ఈ పనిలో వీరు చేరిన నాలుగు రోజులకే లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో కూలీలు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది.
undefined
వలస కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయా ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను ఆదేశించాయి. దీంతో ఈ కాంట్రాక్టర్ ప్రతి ఒక్క కార్మికుడికి రోజుకు రూ. 100 నిత్యావసర సరుకుల కోసం ఇచ్చేవాడు. కొన్ని రోజులకు అవి కూడ ఇవ్వడం మానేశాడు కాంట్రాక్టర్. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధి కోసం పక్క రాష్ట్రం వెళ్లారు. ఆ రాష్ట్రం ఇచ్చే సహాయం కూడ వీరికి అందలేదు.
undefined
దీంతో తమ గ్రామానికి వెళ్లాలని శివం,రామానంద్ లు భావించారు. తమ ఇంటికి చేరుకొనేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో ఎలా వెళ్లాలని ఆలోచించారు. ఈ విషయమై కాంట్రాక్టర్ ను బతిమిలాడారు. దీంతో ఆయన వీరిద్దరితో పాటు మరో ఇద్దరికి కలిపి మూడు పాత సైకిళ్లను సమకూర్చాడు. దీంతో శివం రాథోడ్, రామానంద్ రాథోడ్ లు 600 కి.మీ దూరంలోని తమ గ్రామానికి బయలుదేరారు.
undefined
ఏప్రిల్ 27వ తేదీ తర్వాత వీరు కర్నాల్ నుండి బయలుదేరారు. మే 2వ తేదీన ఆగ్రా సమీపానికి చేరుకొన్నారు. హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ హైవేల పక్కన ఉన్న హోటల్స్ మూసివేసి ఉన్నాయి. దీంతో ఎలాంటి ఆహారం దొరకలేదని శివం, రామానంద్ లు చెప్పారు.అయితే ఓ టోల్ గేట్ వద్ద పోలీసులు తమకు 2 డజన్ల అరటిపండ్లు, బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చారని వాటిని తిని తాము సైకిల్ పై ప్రయాణం చేసినట్టుగా చెప్పారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుండి భార్యాభర్తలు సైకిల్ పై ఒడిశాకు వెళ్లిన విషయం తెలిసిందే. కొందరు కాలినడకనే తమ గ్రామానికి బయలుదేరారు. ముంబై నుండి యూపీకి ఓ వలస కార్మికుడు చేరుకొన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన విషయం తెలిసిందే.
undefined
click me!