లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

First Published | May 4, 2020, 10:49 AM IST

లాక్ డౌన్ మద్యం పరిశ్రమపై తీవ్రంగా పడింది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టాక్ విక్రయానికి నోచుకోక నష్టపోయారు వ్యాపారులు. మరో వైపు నిర్ణీత గడువు పూర్తి కావడంతో బీర్లు పాడై డ్రైనేజీ పాలు కానుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల లీటర్ల బీరు డ్రైనేజీ పాలు కానుంది. 250 మైక్రో బ్రేవరీజీలు ఈ బీరును డ్రైనేజీ పాలు చేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది.ఈ బీర్లతో పాటు 700 కోట్ల విలువైన విదేశీ మద్యం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చిక్కుకొన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉంది.
పాత స్టాక్ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వాల అనుమతి అవసరం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 700 కోట్ల విలువైన విదేశీ మద్యం నిల్వలు గత ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలు జరగాల్సి ఉంది. గత ఏడాది మద్యం నిల్వలను ఈ ఆర్ధిక సంవత్సరంలో విక్రయించాలంటే ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఈ స్టాక్ ను ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని సమాచారం.

బార్లు, క్లబ్బుల్లో లభ్యమయ్యే ప్రెష్, క్రాఫ్ట్ బీర్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్రాఫ్ట్ బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా ఎనిమిది లీటర్ల తాజా బీరును నిల్వ చేసే అన్ని ప్లాంట్లు లాక్ డౌన్ కారణంగా మూసివేశారు.
కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించింది. దీంతో మైక్రో బ్రూవరీస్ వ్యాపారం దెబ్బతినకుండా ఉండే ఉద్దేశ్యంతో బీర్లను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాలను కోరుతుంది అసోసియేషన్. దాదాపుగా ప్రపంచంలోని 35 దేశాల్లో ఇదే రకమైన సదుపాయం ఉన్న విషయాన్ని అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు.
రెండు వారాల పాటు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో అనేక సడలింపులు ఇచ్చారు. కానీ బీర్లు, బార్లు, క్లబ్బుల విషయాల్లో ఎటువంటి సడలింపు లేదు.దీంతో 250 మైక్రో బ్రూవరీలు తమ వద్ద ఉన్న నిల్వలను ఖాళీ చేసేందుకు సిద్దపడుతున్నాయి.
తమ వద్ద ఉన్న స్టాక్ ను విక్రయించకపోతే వాటిని డ్రైనేజీలో పారబోయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గురుగ్రామ్ ప్రాంతంలో కొన్ని కేంద్రాలు డ్రైనేజీలో బీర్లను పారబోస్తున్నట్టుగా తెలుస్తోంది.దేశంలోని 250 మైక్రో బ్రూవరీస్ ద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కలుగుతుందని క్రాఫ్ట్ బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెంకటరాజు తెలిపారు.లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 25 నుండి బీరు ప్లాంట్లను మూసివేశారు.
ఢిల్లీ మినహా ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా ఐఎంఎఫ్ఎల్ కు సుమారు 1.2 మిలియన్ కేసులు చిక్కుకుపోయినట్టుగా కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బ్రేవరిజీస్ కంపెనీస్ (సీఐఏబీసీ) జనరల్ డైరెక్టర్ వినోద్ గిరి అభిప్రాయపడ్డారు. వీటి విలువ సుమారు రూ. 700 కోట్లు ఉంటుందన్నారు.
లాక్ డౌన్ కారణంగా గత ఆర్ధిక సంవత్సరంలో వీటి విక్రయాలు జరగలేదు. దీంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో వీటి విక్రయాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.

Latest Videos

click me!