ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్‌లకు కొత్త ఐటీ మార్గదర్శకాలు.. నేటినుంచే అమల్లోకి..

First Published May 26, 2021, 9:40 AM IST

న్యూ ఢిల్లీ : సోషల్ మీడియా సంస్థల మీద కొత్త ఐటి నిబంధనలు ఈ రోజు (మే 26) నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, గూగుల్ ఇప్పటికే అవసరమైన అంశాల మీద  కృషి చేస్తున్నాయని నొక్కిచెప్పాయి.

న్యూ ఢిల్లీ : సోషల్ మీడియా సంస్థల మీద కొత్త ఐటి నిబంధనలు ఈ రోజు (మే 26) నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, గూగుల్ ఇప్పటికే అవసరమైన అంశాల మీద కృషి చేస్తున్నాయని నొక్కిచెప్పాయి.ఫిబ్రవరి 25 న ప్రకటించిన కొత్త నిబంధనలకు, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్స్ నియామకం చేసుకోవాల్సి ఉంటుంది.
undefined
ఫేస్బుక్ మంగళవారం దీనికి స్పందిస్తూ ఈ కార్యాచరణ ప్రక్రియలను అమలు చేయడానికి కృషి చేస్తోందని, దానికి అనుగుణంగా ఉండేలా తమ కార్యకలాపాలు ఉండేలని లక్ష్యంగా పెట్టుకుందని తెలపింది. ఐటి నిబంధనల నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ మరికొన్ని ముఖ్యమైన అంశాల మీద ప్రభుత్వంతో చర్చిస్తూ ఉంది."ఐటి నిబంధనలను పాటించడం, ప్రభుత్వంతో మరింత కలిసి పనిచేయడానికి అవసరమయ్యే కొన్ని సమస్యలపై చర్చించడాన్ని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐటి నిబంధనలకు అనుగుణంగా, కార్యాచరణ ప్రక్రియలను అమలు చేయడానికి, సామర్థ్యాలను మెరుగుపరచడానికి మేము కృషి చేస్తున్నాం" అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు.
undefined
మా ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా వారి భావాలను వ్యక్తీకరించవచ్చు అనేదానికి ఫేస్‌బుక్ కట్టుబడి ఉందని కూడా ఆ ప్రతినిధి తెలిపారు.చట్టవిరుద్ధమైన రాతలను సహించబోమని, అలాంటివి ఎదుర్కోవడానికి స్థానిక చట్టాలను కూడా పరిగణలోకి తీసుకుని పనిచేయడానికి సంస్థ పనిచేసే అధికార పరిధిలోని స్థానిక చట్టాలకు లోబడి ఉండటానికి కంపెనీ గణనీయమైన ఉత్పత్తి మార్పులు, వనరులు, సిబ్బందిపై నిరంతరం పెట్టుబడులు పెట్టిందని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు."మా ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా ఉంచడంలో మేమెప్పుడూ బాగానే పనిచేశాం. మా విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాం. మా విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకోవడంలో మేముసాధ్యమైనంత పారదర్శకంగా ఉంటాం" అని ప్రతినిధి చెప్పారు.
undefined
డిజిటల్ మీడియాకు సంబంధించిన వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రజలతో, వాటాదారులతో విస్తృతంగా సంప్రదించిన తరువాత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 ఫిబ్రవరిలో రూపొందించబడింది.సోషల్, OTT మీడియా కోసం అనేక మార్గదర్శకాలలో, ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తిత్వం అనుసరించాల్సిన అదనపు శ్రద్ధ వహించాలని ఐటి నియమాలు చెబుతున్నాయి.
undefined
పోస్టింగ్స్ విషయంలో చట్టం, నిబంధనలకు లోబడి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉండేలా చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించండి. అలాంటి వ్యక్తి భారతదేశంలో నివసించే వాడై ఉండాలి.లా ఎన్ ఫోర్సింగ్ ఏజేన్సీలతో 24x7 అందుబాటులో ఉండేలా నోడల్ కాంటాక్ట్ పర్సన్ నియామకం. అతను కూడ భారతదేశంలో నివసించే వాడై ఉండాలి.గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కింద పేర్కొన్న విధులను నిర్వర్తించే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ని నియామకం చేయాలి. అతను కూడా భారతదేశంలో నివసించే వాడై ఉండాలి.అందుకున్న ఫిర్యాదుల వివరాలు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలతో పాటు ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి చేత తొలగించబడిన విషయాల వివరాలను పేర్కొంటూ నెలవారీ నివేదికను ప్రచురించండి.
undefined
ప్రధానంగా మెసేజింగ్ విధానంలో సేవలను అందించే ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తులు భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రతకు సంబంధించిన నేరాన్ని నివారించడం, గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రాసిక్యూషన్ చేయడం లేదా శిక్షించడం వంటి ప్రయోజనాల కోసం మాత్రమే అవసరమయ్యే సమాచారం యొక్క మొదటి సృష్టికర్తను గుర్తించగలుగుతారు. రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా పైన పేర్కొన్న లేదా అత్యాచారం, లైంగిక అసభ్యకరమైన విషయాలు లేదా పిల్లల లైంగిక వేధింపుల విషయానికి సంబంధించిన అంశాల్లో ఐదు కంటే తక్కువ కాలానికి జైలు శిక్ష, శిక్షించదగిన నేరానికి ప్రేరేపించినందుకు శిక్షలు ఉంటాయి.ముఖ్యమైన సోషల్ మీడియా ఇంటర్మీడియరీ భారతదేశంలో దాని వెబ్‌సైట్ లేదా మొబైల్ లో లేదా రెండింటిలో చేసే పోస్టింగులకు సంబంధించి భౌతిక సంప్రదింపులకు అవసరమయ్యే చిరునామా తప్పనిసరిగా కలిగి ఉండాలి.ఈ మార్గదర్శకాలను ఫిబ్రవరిలో ప్రకటించిన కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని, ముఖ్యమైన సోషల్ మీడియా ప్రొవైడర్లు వీటిని అమల్లోకి తేవడానికి మూడు నెలల గడువు విధించారు. ఈ మూడు నెలల కాల వ్యవధి మే 25 లోగా వర్తిస్తుంది.
undefined
click me!