కుటుంబం కోసం స్టీరింగ్ పట్టిన మహిళ: జమ్మూలో తొలి మహిళా బస్సు డ్రైవర్ పూజాదేవి

First Published Dec 27, 2020, 10:37 AM IST

చిన్నతనం నుండి డ్రైవర్  కావాలనే తన కోరికను ఓ మహిళ ఎట్టకేలకు నెరవేర్చుకొంది. తొలుత ఆమె అభీష్టాన్ని వ్యతిరేకించిన కుటుంబం.. చివరకు ఆమె పట్టుదల ముందు తలొగ్గక తప్పలేదు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఓ మహిళ తన కుటుంబాన్ని పోషించేందుకు బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. భర్త సంపాదనకు ఆమె తోడుగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఆమె రికార్డు సృష్టించారు.
undefined
జమ్మూ రాష్ట్రంలోని కతువా జిల్లా నివాసి. తన స్వస్థలం నుండి జమ్మూ వరకు ఆమె బస్సును నడిపారు. దేవి ప్రోఫెషనల్ డ్రైవింగ్ ట్రైనర్.
undefined

Latest Videos


కుటుంబం, బంధువుల నుండి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వృత్తిపరంగా డ్రైవర్ కావాలనే అభిరుచిని ఆమె కొనసాగించింది.
undefined
డ్రైవర్ గా పనిచేయడానికి తనకు తన కుటుంబం నుండి తొలుత ఎవరూ మద్దతు ఇవ్వలేదన్నారు. కానీ, తనకు వేరే ఉద్యోగం ఎంచుకొనేంత చదువు లేదు. దీంతో డ్రైవింగ్ ద్వారానే తాను తన కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని భావించినట్టుగా చెప్పారు.
undefined
తొలుత డ్రైవింగ్ స్కూల్ వాహనంలో ఇతరులకు డ్రైవింగ్ నేర్పించేది. భారీ వాహనాలను నడిపే ప్రోఫెషనల్ డ్రైవర్ గా ఎదగాలనే కలను సాకారం చేసుకోవడానికి మేనమామ సహయం తీసుకొంది
undefined
ఆ తర్వాత కుటుంబ అవసరాల రీత్యా పూజ డ్రైవర్ గా పనిచేసేందుకు కుటుంబసభ్యులు కూడ చివరికి అంగీకరించారు. పూజ భర్త కూలీ పనులు చేస్తారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటుందని కుటుంబసభ్యులు కూడ ఆమెను డ్రైవర్ గా పనిచేసేందుకు అంగీకరించారు.
undefined
డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే సమయంలో ప్రతి నెల ఆమె రూ. 10 వేలు సంపాదించేది. ఆ తర్వాత ఆమె హెవీ వాహనాలు నడిపేందుకు వీలుగా లైసెన్స్ పొందింది.
undefined
డ్రైవింగ్ యూనియన్ నేతలను కలిసి తన డ్రైవింగ్ నైపుణ్యం గురించి ఆమె వివరించింది. చివరికి ఆమెను బస్సు నడిపేందుకు అంగీకరించారు.
undefined
కతువా నుండి జమ్మూ వరకు బస్సు నడిపి ఆమె తన సత్తాను నిరూపించింది. మహిళలు విమానాలను నడుపుతున్నారు. ఈ సమయంలో బస్సు నడపడం అసాధ్యం కాదన్నారు.
undefined
ప్రయాణీకులున్న బస్సును నడపాలనే తన ఆకాంక్షను చివరకు నేరవేర్చుకొన్నట్టుగా ఆమె చెప్పారు. తమ కలకలను సాకారం చేసుకోవాలనే మహిళలకు తన జీవితం స్పూర్తిగా నిలుస్తోందని ఆమె చెప్పారు.
undefined
ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న పూజ. కుటుంబ అవసరాలను తీర్చేందుకు బస్సు డ్రైవర్ గా మారింది. గురువారం నాడు తన స్వస్థలం నుండి జమ్మూ వరకు బస్సు నడిపి తన సత్తాను చూపింది.
undefined
click me!