Manmohan Singh - Ratan Tata
Manmohan Singh, Ratan Tata : భారతదేశం కొద్దిరోజుల వ్యవధిలోకి ఇద్దరు మహనీయులను కోల్పోయింది. ఒకరు వ్యాపార రంగంలో తనదైన ముద్రవేసి దేశ ఖ్యాతిని పెంచిన రతన్ టాట అయితే మరొకరు దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. వ్యాపారానికి మానవత్వం జోడించి బిజినెస్ మెన్స్ అంటే స్వలాభమే కాదు సమాజానికి మేలుచేయాలని చాటిచెప్పిన వ్యాపారదిగ్గజం రతన్ టాటా ఇటీవలే (అక్టోబర్ 9, 2024) కన్నుమూసారు. ఆయన మరణవార్తను మరిచిపోకముందే దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న (డిసెంబర్ 26, బుధవారం) కన్నుమూసారు.
అయితే కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే మరణించిన రతన్ టాట, మన్మోహన్ సింగ్ జీవితాల మధ్య కొన్ని పోలికలున్నారు. ఇద్దరూ అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఇలా రతన్ టాటా, మన్మోహన్ సింగ్ జీవితాల మధ్య పోలికలేంటో చూద్దాం.
Manmohan Singh - Ratan Tata
రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ... ఇద్దరు పూర్వీకులు విదేశీయులే :
రతన్ టాటా పూర్వీకులది ఇరాన్ (పాత పేరు పర్షియా). అక్కడినుండి భారతదేశానికి వలసవచ్చారు కాబట్టి వారిని పారసీలుగా పిలుస్తారు. ఇలా ముంబైలో స్థిరపడిన పార్సీ కుటుంబమే టాటాలది. ఆ కుటుంబానికి చెందినవారే రతన్ టాటా. ఇలా రతన్ టాటా పూర్వీకులది భారతదేశం కాదన్నమాట. అయితే చాలాకాలంగా టాటా కుటుంబం మనదేశంలోనే నివాసముంటున్నారు... టాటా గ్రూప్ ద్వారా దేశవిదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి దేశమే గర్వించేలా చేస్తున్నారు.
రతన్ టాటా లాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పూర్వికులది కూడా ఇప్పుడున్న పాకిస్థాన్. దేశ విభజన సమయంలో మన్మోహన్ సింగ్ కుటుంబం ఇండియాకు వలస వచ్చింది. పాకిస్తాన్ పంజాబ్ లోని చక్వాల్ లోనే 1932,సెప్టెంబర్ 26న జన్మించారు.
Manmohan Singh - Ratan Tata
రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ఇద్దరిని బాల్యం ఒకేలా...
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సునీ టాటా. అయితే రతన్ టాటా ఏడేళ్ల వయసులోని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో తల్లిదండ్రులకు దూరమైన ఆయన నాన్నమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు. నాన్నమ్మ పెంపకంలో రతన్ టాటా విద్యాబుద్దులు నేర్చుకుని టాటా వారసత్వాన్ని నిలబెడుతూ వ్యాపారదిగ్గజంగా ఎదిగారు. దేశమే గర్వించదగ్గ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నారు.
సేమ్ మన్మోహన్ సింగ్ బాల్యం కూడా ఇలాగే గడిచింది. ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో గుర్ముక్ సింగ్ కోహ్లీ, అమృతా కౌర్ దంపతులకు మన్మోహన్ జన్మించారు. అయితే అతడి చిన్నతనంలోనే తల్లి అమృతా కౌర్ మరణించింది. ఇలా తల్లిప్రేమకు దూరమైన మన్మోహన్ ను జమ్మా దేవీ పెంచింది. ఆమె పెంపకంలో విద్యాబుద్దులు నేర్చుకున్న మన్మోహన్ ఆర్థిక వేత్తగా గుర్తింపుపొందారు. ఇలా అంచెలంచెలుగా ఎదగిన ఆయన భారత ప్రధాని స్థాయికి ఎదిగారు.
ఇలా భారతదేశానికి ఇద్దరు గొప్ప నాయకులను అందించారు స్ట్రాంగ్ ఉమెన్స్. వారి పెంపకమే మన్మోహన్,రతన్ టాటాను గొప్పగా తీర్చిదిద్దింది.
Manmohan Singh - Ratan Tata
ఇద్దరి విద్యాభ్యాసం విదేశాల్లోనే :
రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ఇద్దరి ప్రాథమికి విద్యాభ్యాసం ఇండియాలోనే సాగగా ఉన్నత విద్యాభ్యాసం మాత్రం విదేశాల్లో సాగింది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అర్కిటెక్చర్, హర్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి అడ్వన్సుడ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ పూర్తిచేసారు రతన్ టాటా.
ఇక మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసారు. ఆ తర్వాత బ్రిటన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్యాచిలర్స్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసారు. ఇలా ఇటీవలే మృతిచెందిన రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ఇద్దరి మధ్య కొన్ని పోలికలు వున్నాయి.