ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితుడు సునీల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. గతేడాది జూన్‌లో 23 ఏళ్ల నీలమ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. అతను ఆమె తలపై రెండుసార్లు కాల్చి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి ఆమె మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టాడని సిఐఎ భివానీ ఇన్‌ఛార్జ్ రవీంద్ర తెలిపారు.
నీలం సోదరి రోష్ని జూన్‌లో గన్నౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోహ్‌తక్‌లోని బలాండ్ గ్రామానికి చెందిన తన సోదరి ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లిందని ఆమె చెప్పారు. నిరుడు జనవరిలో సునీల్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు రప్పించి, ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.