ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాలే ఉద్యోగాలు ... హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ ఇంకెన్నో

Published : Jan 23, 2025, 10:48 PM ISTUpdated : Jan 24, 2025, 10:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం అవుతోంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికన కేవలం పెట్టుబడులపైనే కాదు ఉద్యోగ కల్పనపై కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే భారీ కంపనీలతో చర్చలు జరిగాయి. 

PREV
14
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాలే ఉద్యోగాలు ... హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ ఇంకెన్నో
Nara Lokesh

Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. ఆ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులే కాదు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగుపడనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేందకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ శక్తివంచన లేకుండా కృషిచేసారు. ఇలా గత మూడు రోజులుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటించిన వీరు ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న వ్యాపారవేత్తలను ఏపీ వైపు ఆకర్షించారు. 

దావోస్ లో అడుగుపెట్టినప్పడి నుండి చంద్రబాబు, లోకేష్ లు బిజీబిజీగా గడిపారు. వ్యాపార దిగ్గజాలతో వరుసగా సమావేశం అవుతూ ఏపీలో పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ప్రెండ్లీ ప్రభుత్వం వుందని... పెట్టుబడులతో ముందుకు వస్తే అన్నిరకాలుగా సహాయసహకారాలకు ముందుంటామని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర వనరులతో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులకు గురించి వివరించారు. 

ఇలా చంద్రబాబు, నారా లోకేష్ బృందం ఏపీకి పెట్టుబడులను ఆకర్షించారు. ఇవాళ(గురువారం) రాష్ట్రానికి తిరుగుపయనం అవుతూ కూడా పలు కంపనీలతో చర్చలు జరిపారు. ఇలా హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ సంస్థలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేవలం పెట్టుబడులే కాదు ఏపీ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కంపనీలతో చర్చలు జరిపారు.

24
Andhra Pradesh Jobs

ఏపీలో హెచ్‌సీఎల్ విస్తరణ ... ఎన్ని ఉద్యోగాలో తెలుసా? 

హెచ్‌సీఎల్ సిఈఓ కళ్యాణ్ కుమార్ తో ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హెచ్‌సీఎల్ విస్తరణ కార్యకలాపాలపై ఇద్దరూ చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 గురించి హెచ్‌సీఎల్ సిఈఓకు మంత్రి లోకేష్ వివరించారు. 

రాష్ట్రంలో మరో 10వేలమందికి ఉపాధి కల్పించేలా హెచ్‌సీఎల్ ను విస్తరించాలని లోకేష్ కోరారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్తపాలసీలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎఫ్ఐడిలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. ఎపిలోకి రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్ మెంట్ ఇంపోర్ట్ కు 50శాతం సబ్సిడీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగంలో ఏపి 10శాతం వాటా కలిగి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, 3 డెడికేటెడ్ ఐటి స్పెషల్ ఎకనమిక్ జోన్లు ఉన్నాయని లోకేష్ చెప్పారు.

ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ సిఈఓ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ... తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం తమ సంస్థలో 2.18లక్షల మంది పనిచేస్తున్నారని... 2024-25లో హెచ్‌సీఎల్ రూ.4,235 కోట్ల నికరలాభాన్ని ఆర్జించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్థ విస్తరణ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నారు. త్వరలో విస్తరణ కార్యకలాపాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని కళ్యాణ్ కుమార్ స్పష్టం చేసారు.

34
it jobs

ఏపీకి కాగ్నిజెంట్ గుడ్ న్యూస్ : 

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సిఈఓ రవికుమార్ తో కూడా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని లోకేష్ అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీని ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందన్నారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హైస్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి ఏపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ కాగ్నిజెంట్ సీఈవోను కోరారు. 

కాగ్నిజెంట్ సిఈఓ రవికుమార్ మాట్లాడుతూ... కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్న 80వేలమంది ఉద్యోగులను టైర్ -1 నుంచి టైర్ -2 నగరాలకు మార్చేందకు ప్రణాళికలను ప్రకటించామన్నారు. గ్లోబల్ స్కిల్ ఇనియేటివ్ లో భాగంగా జెనరేటివ్ ఎఐ అధునాతన సాంకేతిక నైపుణ్యాల్లో 10లక్షల మందికి సాధికారిత కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఏపి ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ తెలిపారు. 
 

44
Nara Lokesh

ఎపిలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు :

సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, ఇన్ ఫ్రా రంగాల్లో పేరెన్నికగన్న బహుళజాతి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిఖ్ సుల్తాన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.  భారతదేశ ఎగుమతుల్లో ఏపి 16.5శాతం వాటాతో 3వ అతిపెద్ద పోర్టు స్టేట్ గా ఉందని లోకేష్ తెలిపారు. దేశం ఎగుమతుల ఆదాయంలో 6శాతం అంటే రూ. 1.59లక్షల కోట్లు ఏపి సాధించిందన్నారు. 1054 కి.మీ.ల సుదూర తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు కలిగి కార్గో రవాణా కార్యకలాపాలకు పూర్తి అనుకూల వాతావరణం ఏపీలో వుందని తెలిపారు. దేశంలో 4వ అతి పెద్దదైన విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది 35.77 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసిందని లోకేష్ వెల్లడించారు. 

కార్గోరవాణాకు అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఎపిలో లాజిస్టిక్స్, ఇన్ ఫ్రాక్ట్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఎజిలిటీ వైస్ ఛైర్మన్ ను కోరారు లోకేష్. ఓడరేవుల పరిసరాల్లో ఎజిలిటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు, వేర్ హౌస్ లు, కోల్డు స్టోరేజిలు ఏర్పాటుచేయాలని సూచించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. 

తారిఖ్ సుల్తాన్ మాట్లాడుతూ... ఎజిలిటీ సంస్థ భారత్ లో బలమైన ఉనికి కలిగి అత్యాధునిక లాజిస్టిక్ సేవలను అందిస్తోందన్నారు. సరుకురవాణా, కాంట్రాక్ట్ లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. భారత్ లో ఎజిలిటీ లాజిస్టిక్ పార్కు 8లక్షల చదరపుమీటర్ల భూమి కలిగి వేర్ హౌసింగ్, గిడ్డంగులను నిర్వహిస్తోందని తెలిపారు.

డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ తో స్థిరమైన వ్యాపార పద్ధతులను అవలంభిస్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తారిఖ్ సుల్తాన్ తెలిపారు.
 

Read more Photos on
click me!

Recommended Stories