ఏమిటీ..! ఈ ఇండియన్ సిటీలో చిన్న మాంసపు ముక్క కనిపించదా..! కారణమేంటో తెెలుసా?

Published : Jan 22, 2025, 10:29 PM IST

ఈ భారతీయ నగరం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? మాంసం నిషేధానికి గల కారణం ఏమిటో చూద్దాం. 

PREV
17
ఏమిటీ..! ఈ ఇండియన్ సిటీలో చిన్న మాంసపు ముక్క కనిపించదా..! కారణమేంటో తెెలుసా?
NonVeg Ban in Palitana

ఈ నగరంలో మాంసం అమ్మడమే కాదు, తినడం కూడా నేరం. అంటే ఈ నగరంలో మాంసం పూర్తిగా నిషేధించబడింది. మరి ప్రపంచంలో మాంసానికి నిషేధం విధించిన ఆ నగరం ఏది? ఏ రాష్ట్రంలో వుంది?  

27
NonVeg Ban in Palitana

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలితానా నగరం మాంసాన్ని పూర్తిగా నిషేధించి వార్తల్లో నిలిచింది. ఇలా మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించిన నగరం ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిదై వుంటుంది.మాంసంకోసం జంతువులను చంపడమే వేరే ప్రాంతాల నుండి తీసుకువచ్చి అమ్మడం, వండటం, తినడం కూడా ఇక్కడ నేరమేనట. 
 

37
NonVeg Ban in Palitana

ప్రస్తుతం పాలితానాలో మాంసం, గుడ్ల అమ్మకాలు నిలిపివేయబడ్డాయి, జంతువులను వధించడం కూడా పూర్తిగా నిషేధించబడింది. దీంతో జంతు హింసను పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోని మొట్టమొదటి నగరంగా ఇది అవతరించింది. 
 

47
NonVeg Ban in Palitana

జైన మతాన్ని పాటించేవారు ఎక్కువగా ఉన్న ఈ నగరంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని 200 మంది జైన సన్యాసులు నిరసన తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైన సన్యాసుల నిరసన జైన మత ప్రాథమిక సూత్రం అహింసను ఆధారంగా చేసుకుంది.
 

57
NonVeg Ban in Palitana

మాంసాన్ని చూడటం కూడా మానసికంగా ఇబ్బంది కలిగిస్తుందని పాలితానాలోని జైన సన్యాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గుజరాత్ కోర్టు మాంసానికి నిషేధం విధించింది. 

67
NonVeg Ban in Palitana

పాలితానాలో మాంసం నిషేధం తర్వాత గుజరాత్‌లోని ఇతర నగరాలైన రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్‌లలో కూడా ఇదే నిబంధనలు అమలు చేశారు. రాజ్‌కోట్‌లో మాంసాహార వంటకాలు తయారు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మాంసం ప్రదర్శించడంపై నిషేధం విధించారు.

77
NonVeg Ban in Palitana

గుజరాత్‌లోని శత్రుంజయ కొండలపై 800 కి పైగా జైన దేవాలయాలు ఉన్నాయి. పాలితానాను 'జైన దేవాలయాల నగరం' అని కూడా పిలుస్తారు. ఈ నగరంలోని ఆదినాథ్ ఆలయం వంటి పవిత్ర స్థలాలు అక్కడి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

click me!

Recommended Stories