టైమ్స్‌స్క్వేర్‌లో మహా శివరాత్రి సందడి.. స్క్రీన్‌లపై శివుడి దృశ్యాలు.. డ్యాన్స్ చేస్తూ స్థానికుల వేడుక

First Published | Mar 6, 2024, 7:29 PM IST

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికులు అంతా కలిసి సంగీతం, నృత్యాల్లో మునిగిపోయారు.

timessquare mahashivratri celebrations

MahaShivratri: మహాశివరాత్రి వచ్చేస్తున్నది. హిందువులకు ముఖ్యంగా శైవ భక్తులకు ఇది ముఖ్యమైన పండుగ. అందరూ తప్పకుండా శివాలయాలను దర్శించుకుంటారు. ఆ ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. వెలిగే దీపాల్లో తాము తెచ్చిన నూనె పోసి దేవుడిని దర్శించుకుంటారు. ఉపవాసాలు పడతారు. రాత్రంతా జాగారం చేస్తుంటారు. ఈ జాగారాన్ని ఆసరాగా చేసుకునే పాత సినిమాలు థియేటర్‌లలో ఎక్స్‌ట్రా షోలుగా రీరిలీజ్ చేస్తుంటారు. ఇదంతా మన దేశానికే పరిమితం అని ఇప్పుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. మహా శివరాత్రి వేడుకలు అగ్రరాజ్యం అమెరికాను కూడా తాకాయి.

timessquare mahashivratri celebrations

అమెరికాలో ప్రముఖ నగరం న్యూయార్క్‌లో టైమ్స్‌స్క్వేర్ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ టైమ్స్‌స్క్వేర్‌లో ఈ రోజు స్థానికులు మహా శివరాత్రి వేడుకలు జరుపుకున్నారు. టైమ్స్ స్క్వేర్‌లో మహాశివరాత్రిని సందడిగా జరుపుకున్నారు. టైమ్స్ స్క్వేర్‌లోని నలువైపులా ఉన్న స్క్రీన్‌లలో మహా శివుడి దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలు, సంగీతంతో స్థానికులు గొంతు కలిపారు. పాదం కదిపారు.

Latest Videos


timessquare mahashivratri celebrations

టైమ్స్ స్క్వేర్‌లో స్థానికులు.. అంటే భారత ప్రవాసులతోపాటు అమెరికా వాసులు కూడా శివుడి సంగీతానికి స్టెప్పులు వేశారు.
 

timessquare mahashivratri celebrations

‘న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ మహాశివరాత్రిని ఘనంగా స్వాగతించింది. శివరాత్రి ప్రాముఖ్యతను ప్రపంచం తెలుసుకుంటున్నది. మానవ సామర్థ్యాలను, మార్పునకు అవకాశాన్ని వేడుక చేసుకుంటున్నదు’ అని సద్గురు ఈ చిత్రాలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

click me!