లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

Published : May 10, 2020, 11:46 AM IST

తమ కూతురికి కరోనా రాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తల్లి కూతురిని భుజాలపై ఎత్తుకొని 900 కి.మీ పాటు నడిచింది. ఇండోర్ నుండి ఆమేథీ లోని జగదీష్ పూర్ కు బయలుదేరింది. 

PREV
110
లాక్‌డౌన్ ఎఫెక్ట్:  భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

కూతురును కాపాడుకొనేందుకు ఓ తల్లి 900 కి.మీ పాటు నడిచింది. కూతురును ఎత్తుకొని 900 కి.మీ దూరంలోని తన స్వంత గ్రామానికి చేరుకొంది. లాక్ డౌన్ పొడిగించడంతో ఇక చేసేది లేక ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

210

లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు చేరుకొనేందుకు వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా కూడ వలస కూలీలు తమకు తోచిన మార్గాల్లో ఇళ్లకు చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

310

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అక్విబ్, ఆయన భార్య రుక్సానాలకు ఓ ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఉపాధి కోసం రుక్సానా దంపతులు ఇండోర్ లో నివాసం ఉంటున్నారు. 

410

రుక్సానా భర్త అక్విబ్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిచేసేది. భార్యాభర్తలు ప్రతి నెల రూ. 9 వేలు సంపాదించేవారు. వీటిలో రూ. 3 వేలను తమ కూతురు పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు.

510

రుక్సానా 8వ తరగతితోనే చదువును నిలిపివేసింది. తాను చదువుకోలేకపోయినా కూడ తన కూతురును చదివించాలని భావించింది. అందుకే ప్రతి నెల కూతురి పేరున  రూ. 3 వేలను బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.

610

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రుక్సానా దంపతులకు పని లేకుండా పోయింది. ఇండోర్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుతున్నాయి. దీంతో కరోనా నుండి రక్షణ కోసం తమ స్వంత గ్రామానికి  వెళ్లాలని రుక్సానా భావించింది. ఇదే విషయమై భర్త అక్విబ్ తో చర్చించింది. 

710

కానీ, భర్త మాత్రం  ఇండోర్ నుండి తాను ఇప్పుడే రానని చెప్పాడు. అయితే కూతురికి కరోనా రాకుండా ఉండేందుకు యూపీ వెళ్తానని రుక్సానా చెప్పింది. ధీనికి భర్త కూడ సరేనని చెప్పాడు. 

810

ఇదే సమయంలో ఇండోర్ లో ఉంటున్న  కొందరు వలస కూలీలు కూడ తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. వారితో కలిసి రుక్సానా కూతురిని తీసుకొని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  అమేథీలో గల జగదీష్ పూర్ ప్రాంతానికి బయలుదేరింది. కూతురికి ఆకలి కాకుండా ఉండేందుకు బిస్కట్లు, జామ్ తో పాటు బట్టలను సర్దుకొని తమ గ్రామానికి చెందిన కూలీలతో ఆమె బయలుదేరింది.

910

ఈ నెల 6వ తేదీన రాత్రి ఇండోర్ నుండి కాలినడకన రుక్సానా ఆమె కూతురితో పాటు వలస కూలీలు బయలుదేరారు. రుక్సానా తన కూతురిని భుజాలపై ఎత్తుకొని నడకన సాగింది. 24 గంటల పాటు నడక  సాగించారు. మరో వైపు రెండు లారీలు, ఓ ట్రాక్టర్ లో ప్రయాణం చేసి శనివారం నాడు వీరంతా లక్నోకు చేరుకొన్నారు. 

1010

మండుటెండలో కాలినడకన సాగడం వల్ల వలస కూలీల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. తమ కాళ్లకు అయిన గాయాలను శుభ్రం చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నారు. రోడ్డు పక్కనే విశ్రాంతి తీసుకొన్న తర్వాత లక్నో నుండి ఆమేథీ మార్గంలో ప్రయాణం సాగించారు. రుక్సానా ఈ గ్రూపుకు ముందు భాగంలో నడుస్తోంది. ఆమె వెనుకే వలస కూలీలు అనుసరిస్తున్నారు

click me!

Recommended Stories