లాక్ డౌన్ ఎఫెక్ట్ దేవాలయాలపై కూడ పడింది. తిరుపతి వెంకన్న తరహాలోనే షిరిడి సాయిబాబా దేవాలయం కూడ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఆలయం మూసివేతతో ప్రతిరోజూ రూ.1.5 కోట్లను ఈ ఆలయం కోల్పోయింది.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మార్చి 17వ తేదీ నుండే ఈ ఆలయాన్ని మూసివేశారు.
undefined
లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ లో వచ్చిన విరాళాలు మాత్రం కొంత ఆలయవర్గాలకు కొంత ఊరటనిచ్చాయి. ఆలయం మూసిన రోజు నుండి ఈ నెల 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో రూ. 2.53 కోట్లు విరాళాల రూపంలో ఆలయానికి వచ్చాయి. ఈ లెక్కన ప్రతి రోజూ రూ. 6 లక్షల ఆదాయాన్ని దక్కిందని చెప్పొచ్చు.
undefined
ప్రతి ఏటా సాయిబాబా ఆలయం రూ. 600 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి రోజూ 1.64 కోట్ల ఆదాయం ఈ ఆలయానికి ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకు సుమారు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని ఆలయం కోల్పోయింది.
undefined
జూన్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తే మరో రూ. 150 కోట్లను ఆలయ ట్రస్టీ నష్టపోనుంది. అదే జరిగితే ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంది.
undefined
కరోనా నేపథ్యంలో మార్చి 17వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. అయితే ప్రతి రోజూ 8నుండి 9 మంది భక్తులకు ఆన్ లైన్ లో సాయిబాబా దర్శనం కోసం అవకాశం కల్పిస్తున్నారు.ఆన్ లైన్ దర్శనం ద్వారా భక్తులు రూ. 2.53 కోట్లు ఆలయానికి చెల్లించారు.ప్రతి రోజూ ఆలయాన్ని 40 నుండి 50 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. వీరి ద్వారా కనీసం ఒక్క కోటి రూపాయాల నగదు ఆలయానికి వచ్చేది.
undefined
ప్రతి ఏటా సాయి ఆలయానికి వచ్చే 600 కోట్లలో ఎక్కువగా నగదు, వెండి, బంగారం రూపంలో అందుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయానికి భారీగా ఆదాయం పడిపోవడంతో సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ట్రస్ట్ అభిప్రాయంతో ఉంది.
undefined
2019-20 ఆర్ధిక సంవత్సరం ముగింపులో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మరో వైపు 20-21లో ఆలయ ఆర్ధిక వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
వేలాది మందికి ప్రతి ఏటా ఉచిత పరీక్షలు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. గుండె ఆపరేషన్లు, డయాలసిస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా రూ. 100 కోట్లను మెడికల్ అవసరాలను తీర్చేందుకు ఖర్చు చేస్తోంది ఈ ట్రస్ట్.
undefined