భారత్ కి పొంచి ఉన్న ప్రమాదం.. జులైలో భారీగా పెరగనున్న కరోనా కేసులు

First Published | May 9, 2020, 12:42 PM IST

ఇతర దేశాలతో పోలిస్తే... భారత్ ఇప్పటివరకు కరోనా విషయంలో కాస్త అదుపులో ఉన్నట్లే. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మరణాల సంఖ్య 70వేలు దాటింది. ఇక కేసుల సంఖ్య 13లక్షలు దాటింది.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 60వేలకు చేరువయ్యాయి. ఇక మరణాల సంఖ్య 2వేలకు చేరువైంది.
undefined
అయితే.. ఇతర దేశాలతో పోలిస్తే... భారత్ ఇప్పటివరకు కరోనా విషయంలో కాస్త అదుపులో ఉన్నట్లే. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మరణాల సంఖ్య 70వేలు దాటింది. ఇక కేసుల సంఖ్య 13లక్షలు దాటింది.
undefined

Latest Videos


అయితే... భారత్ కి కరోనా నుంచి ప్రమాదం మరింత పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో జూన్-జులైలో కరోనా విజృంభణ ఉండే అవకాశముంది ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అంచనావేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆయన కీలక హెచ్చరిక చేశారు.
undefined
జూన్, జూలై నెల్లలో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రెడ్ జోన్స్, కరోనా హాట్‌‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు
undefined
భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయన్నారు.
undefined
అయితే...దేశంలో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో కచ్చితంగా చెప్పలేమని కానీ ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలై నెలల్లో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని గుల్జేరియా తెలిపారు.
undefined
డబ్ల్యూహెచ్ఓ డేవిడ్ నబారో కూడా ఇదే విషయం చెప్పడం గమనార్హం. జులై నెలలో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
undefined
ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ ఉంది కాబట్టి.. పరిస్థితి అదుపులో ఉందని.. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసులు మరింత పెరుగుతాయని ఆయన చెప్పారు.
undefined
అయితే... ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అసవరం లేదన్నారు. క్రమంగా కరోనా కేసులు తగ్గుతాయని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
undefined
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశ జనాభాతో పోలిస్తే.. అదుపులో ఉన్నట్లేనని ఆయన చెప్పారు. దేశంలో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే ప్రమాదం తక్కువగా ఉందని చెప్పారు.
undefined
click me!