LPG గ్యాస్ వాడుతున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. జూన్ 30 లోగా ఈ పని చేయకపోతే సబ్సిడీ గోవిందా!

Published : Jun 15, 2026, 09:28 AM IST

LPG Gas Cylinder eKYC : ఎల్‌పీజీ గ్యాస్ కస్టమర్లు జూన్ 30 లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. లేదంటే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. మీ మొబైల్‌లోనే కేవైసీ ఎలా పూర్తి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
LPG Gas: జూన్ 30 లోగా ఈ-కేవైసీ చేయకపోతే సబ్సిడీ కట్ ! మీ ఫోన్‌లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి !

మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే మీరు వెంటనే ఈ పని చేయండి. ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) గ్యాస్ కస్టమర్ల కోసం ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోగా తమ ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఒకవేళ ఈ గడువు లోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులందరికీ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది, కాబట్టి డెడ్‌లైన్ లోపే ఈ పని పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

26
అసలు ఎల్‌పీజీ ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి చేశారు?

ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రకరకాల కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్, గ్యాస్ రవాణాలో 20 శాతం వాటా ఉండే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించడానికి, సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆధార్-బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను మ్యాండేటరీ చేసింది.

మార్చి నెలలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీనిని తప్పనిసరి చేయగా, తాజా ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకోని ప్రతి ఎల్‌పీజీ వినియోగదారుడు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు నాన్-ఉజ్వల కస్టమర్ అయి ఉండి, ఇదివరకే కేవైసీ చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

36
ఇండియన్ ఆయిల్ ఇచ్చిన కొత్త అడ్వైజరీ ఏంటి?

జూన్ 12న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఎలాంటి బ్రేక్స్ లేకుండా మీ ఎల్‌పీజీ సబ్సిడీ బెనిఫిట్స్ కంటిన్యూ అవ్వాలంటే వెంటనే ఈ-కేవైసీ చేయండి" అని కోరింది. జూన్ 30 లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని, ఇది చాలా సింపుల్, సేఫ్ అండ్ కంప్లీట్‌గా ఫ్రీ అని స్పష్టం చేసింది.

కస్టమర్లు తమ ఇంట్లో కూర్చొని ఇండియన్ ఆయిల్ వన్ (IndianOil ONE) యాప్ ద్వారా లేదా దగ్గరలోని ఇండేన్ డిస్ట్రిబ్యూటర్, ఎల్‌పీజీ డెలివరీ బాయ్స్ ద్వారా కూడా దీనిని ఫ్రీగా చేసుకోవచ్చు. లేదంటే సబ్సిడీ ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.

46
ఇండేన్ గ్యాస్ ఈ-కేవైసీ చేసుకునే సింపుల్ స్టెప్స్

ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఫేస్ బయోమెట్రిక్ ద్వారా ఇంట్లోనే ఉండి ఈ-కేవైసీ చేసుకోవచ్చు.

• స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్‌లో 'IndianOil One' యాప్, 'AadhaarFaceRD' యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

• స్టెప్ 2: ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఓపెన్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో సైన్ అప్ అవ్వండి.

• స్టెప్ 3: మీ గ్యాస్ క్యాష్ మెమో లేదా సబ్‌స్క్రిప్షన్ వోచర్‌పై ఉండే 16 అంకెల ఎల్‌పీజీ ఐడీని లింక్ చేయండి. అప్పుడు మీ కస్టమర్ డీటెయిల్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

• స్టెప్ 4: హోమ్ స్క్రీన్‌కి వెళ్లి, అక్కడ 'My Profile' ఆప్షన్‌పై టాప్ చేయండి.

• స్టెప్ 5: ప్రొఫైల్‌లో మీ వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుని, కింద ఉన్న 're-KYC' బటన్‌పై క్లిక్ చేయండి.

• స్టెప్ 6: స్క్రీన్‌పై కొన్ని కండిషన్స్ వస్తాయి, వాటిని చదివి మీ అంగీకారం తెలపండి.

• స్టెప్ 7: ఫేస్ అథెంటికేషన్ పేజీలో ఉన్న టిక్ బాక్స్‌ను సెలెక్ట్ చేసి, 'Face Scan' బటన్ నొక్కండి. ఆధార్ ఫేస్ యాప్ ఓపెన్ అవుతుంది, మీ ఫేస్ స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. దీనికి ముందు మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే, మొదట దాన్ని అన్‌లాక్ చేయండి.

56
భారత్ గ్యాస్ ఈ-కేవైసీ ప్రాసెస్ ఇక్కడ చూడండి

భారత్ గ్యాస్ కస్టమర్లు కూడా చాలా ఈజీగా మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీని కంప్లీట్ చేయొచ్చు.

• స్టెప్ 1: మొదట మీ ఫోన్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి 'Hello BPCL' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

• స్టెప్ 2: యాప్ డౌన్‌లోడ్ అయ్యాక, ఓపెన్ చేసి మీ రిజిస్టర్డ్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

• స్టెప్ 3: యాప్ హోమ్‌పేజీలోనే మీకు 'e-KYC' అనే ఆప్షన్ కనిపిస్తుంది.

• స్టెప్ 4: దానిపై క్లిక్ చేయగానే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి.

• స్టెప్ 5: ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక, స్క్రీన్‌పై వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఓకే చేయండి.

• స్టెప్ 6: ఆ తర్వాత 'Proceed' పై క్లిక్ చేస్తే మీ ఫేస్ స్కాన్ అడుగుతుంది, బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తి చేయడంతో మీ ఈ-కేవైసీ సక్సెస్ అవుతుంది.

66
హెచ్‌పీ గ్యాస్ (HP Gas) ఆన్‌లైన్ ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం

హెచ్‌పీ గ్యాస్ వాడుతున్న వారు కూడా జూన్ 30 లోపే ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

• స్టెప్ 1: మీ మొబైల్‌లో 'HP Pay' యాప్‌తో పాటు 'Aadhaar FaceRD' యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

• స్టెప్ 2: హెచ్‌పీ పే యాప్ ఓపెన్ చేసి, రిజిస్టర్ బటన్ నొక్కి మీ గ్యాస్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.

• స్టెప్ 3: మీ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

• స్టెప్ 4: ఫ్యూచర్‌లో యాప్ ఈజీగా లాగిన్ అవ్వడానికి 4 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోండి.

• స్టెప్ 5: ఇప్పుడు ఎంపిన్‌తో లాగిన్ అయి, లొకేషన్ పర్మిషన్స్ అలౌ చేయండి.

• స్టెప్ 6: యాప్‌లోని 'MY HP' సెక్షన్‌కు వెళ్లి, అక్కడ 'LPG' ఆప్షన్‌పై టాప్ చేయండి.

• స్టెప్ 7: అక్కడ మీకు 'e-KYC' ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీకి వెళ్లండి.

• స్టెప్ 8: కండిషన్స్ అంగీకరించిన తర్వాత 'Capture Face' అనే ఆప్షన్ నొక్కండి.

• స్టెప్ 9: వెంటనే ఆధార్ ఫేస్ రీడర్ యాప్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్‌పై చూపించే ఇన్‌స్ట్రక్షన్స్ పాటిస్తూ మీ ముఖాన్ని స్కాన్ చేస్తే హెచ్‌పీ గ్యాస్ ఈ-కేవైసీ ప్రాసెస్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories