ప్రముఖ నటి, రాజకీయనాయకురాలు కిరణ్ ఖేర్ కు బ్లడ్ క్యాన్సర్ !

First Published Apr 1, 2021, 11:53 AM IST

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని చండీగఢ్ బిజెపి అధ్యక్షుడు అరుణ్ సూద్ వెల్లడించారు. బుధవారం విలేకరులలో జరిపిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని చండీగఢ్ బిజెపి అధ్యక్షుడు అరుణ్ సూద్ వెల్లడించారు. బుధవారం విలేకరులలో జరిపిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
undefined
అరుణ్ సూద్ మాట్లాడుతూ, "కిరోన్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11 న చండీగఢ్ లోని తన ఇంట్లో పడడం వల్ల ఎడమ చేయి విరిగింది. దీంతో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
undefined
ఈ వ్యాధి ఆమె ఎడమ చేయి నుంచి కుడి భుజానికి వ్యాపించింది. దీంతో ఆమె చికిత్స కోసం, డిసెంబర్ 4 న ముంబైకి వెళ్ళవలసి వచ్చింది. నాలుగు నెలల చికిత్స అనంతరం ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు. కోకిలాబెన్ ఆస్పత్రినుంచి ఆమె డిశ్చార్జ్ అవుతున్నారు. అయినప్పటికీ ఆమె రోజూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు.
undefined
కిర్రోన్ ఖేర్ 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి పవన్ బన్సాల్ ను ఓడించి పదవిని చేపట్టారు. తిరిగి 2019లో మళ్లీ అతన్ని ఓడించి, చండీగఢ్ లో తన స్థానాన్ని నిలుపుకున్నారు. అయితే కిరణ్ ఖేర్ ఆరోగ్య పరిస్థితి మీద ఇప్పటివరకు ఆమె కానీ, ఆమె భర్త, నటుడు అనుపమ్ ఖేర్ కానీ ఎలాంటి అధికారక ప్రకటనా చేయలేదు.
undefined
click me!