వరకట్న వేధింపుల మీద వాట్సప్ మెసేజ్ లు పెట్టిన యువతి మృతి..!

First Published Jun 24, 2021, 9:46 AM IST

తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి నిండు జీవితం బలయ్యింది. తనను భర్త అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని..ఫొటోలతో సహా వాట్సప్ మెసేజ్ లు పంపిన 24 యేళ్ల యువతి సోమవారం భర్త ఇంట్లో శవమై తేలింది. 

తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి నిండు జీవితం బలయ్యింది. తనను భర్త అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని..ఫొటోలతో సహా వాట్సప్ మెసేజ్ లు పంపిన 24 యేళ్ల యువతి సోమవారం భర్త ఇంట్లో శవమై తేలింది.
undefined
ఆయుర్వేద వైద్య విద్యార్థి అయిన విస్మయ నాయర్ తన మెసేజ్ లలో భర్త కిరణ్ కుమార్ తన జుట్టు పట్టుకుని లాగి, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలూ షేర్ చేసింది.
undefined
ఈ మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దీనిమీద స్పందించారు. "అనాగరిక వరకట్న వ్యవస్థ" అని పిలుస్తూ.. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఫిర్యాదులపై ప్రత్యేక అధికారులు స్పందించేలా చేస్తానని ప్రకటించారు."మనమంతా ఒక సమాజంగా, ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. వివాహం అనేది కుటుంబం, సామాజిక స్థితి, సంపద ప్రదర్శన కాకూడదు. అనాగరిక వరకట్న విధానం మన కుమార్తెలను సరుకుగా దిగజార్చుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి. అమ్మాయిల్ని అమ్మే వస్తువులుగా కాకుండా మనుషులుగా చూసుకోవాలని "ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. డౌరీ హరాస్ మెంట్ సెల్ కు సంబంధించిన హెల్ప్‌లైన్లను షేర్ చేశారు.
undefined
ఈ సంఘటన తరువాత రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగంలో ఉన్న కిరణ్ కుమార్ (30) ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ కుటుంబాన్ని సందర్శించిన నాయకులలో కాంగ్రెస్ మాజీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలా ఉన్నారు.కాగా , సోమవారం విల్లమ కొల్లంలోని తన భర్త ఇంటి బాత్రూంలో విస్మయ ఉరివేసుకుని కనిపించింది. దీనిమీద ఆమె తమ్ముడు విజిత్ మాట్లాడుతూ.. "నా సోదరి మరణం ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే. ఎందుకంటే ఆమె వరకట్న వేధింపులకు గురైంది. చాలా హింస అనుభవించింది. ఆ తరువాత ఆమె కొంతకాలం మా ఇంటి వద్ద కూడా ఉంది" అన్నారు.
undefined
విస్మయ, కిరణ్ కుమార్ ల వివాహం గతేడాది జూన్‌లో జరిగింది. ఈ సమయంలో కుమార్‌కు 100 బంగారు నాణేలు, ఎకరానికి పైగా భూమిని వరకట్నంగా ఇచ్చారు. దీంతోపాటు రూ. 10 లక్షల విలువైన కారును కట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ తెలిపారు. అయినా కూడా అతను విస్మయను హింసిస్తూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని వాపోయాడు. "గత జనవరి అర్ధరాత్రి మా ఇంట్లోనే, మా ముందే కిరణ్ కుమార్ విస్మయను కొట్టాడు’’ అని నాయర్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో తెలిపారు. దీంతో తాను అత్తగారింటికి వెళ్లొద్దని తన కూతుర్ని ఆపానని తెలిపారు.
undefined
అయితే, మార్చి 17 న ఆమె పుట్టినరోజునాడు ఆమె కుమార్‌తో కలిసి తన ఇంటికి వెళ్లిందని, తమకు చెప్పకుండా ఆమె కాలేజీ దగ్గర్నుండి కిరణ్ ఆమెను తీసుకువెళ్లాడని తెలిపారు. కుమార్ మీద విస్మయ పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు రోజులకు ఇరు కుటుంబాలు కూర్చుని రాజీ చేసుకున్నాయి.
undefined
తిరిగి అత్తింటికి వెళ్లిన విస్మయ ఆ తరువాత తల్లితో తప్ప వేరేవారితో కాంటాక్ట్ లో లేదని పోలీసులు తెలిపారు. విస్మయ భర్త తనకు కొనిచ్చిన పదిలక్షల కారుకు బదులు క్యాష్ ఇవ్వాలని.. తనకు కారు వద్దని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడని విస్మయ తండ్రి పేర్కొన్నాడు. అయితే అది సాధ్యమయ్యే విషయం కాదని తాను స్పష్టంగా చెప్పానని నాయర్ చెప్పారు.
undefined
ఈ ఘటన మీద కేరళ పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహెరా మాట్లాడుతూ "కొల్లంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. ఇది కేరళ ప్రజలందరి మనసుల్నీ కదిలించిందని, షాక్ ఇచ్చిందని" అని అన్నారు.ఈ కేసులో నిందితుడు కిరణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘దీంట్లో మరెవరి ప్రమేయమైనా ఉందా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నాం. వారిమీద కూడా చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం" అని ఆయన చెప్పారు.
undefined
click me!