Kerala Results 2026 : కేరళలో బిజెపి ఖాతా తెరవడం ఖాయం.. గెలిచే నాలుగు సీట్లు ఇవే..!

Published : May 04, 2026, 11:03 AM IST

Kerala Assembly Election Result 2026 : కేరళలో బిజెపి అధికారానికి ఆమడదూరంలో నిలిచేలా ఉంది. కానీ వారికి ఊరటనిచ్చేలా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అసెంబ్లీలేవో తెలుసా..?

PREV
14
కేరళలో బిజెపికి ఊరట

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీలన్నింటికి పరాభవం తప్పడంలేదు... ఊహించని విధంగా ప్రతిపక్షాలు విజయం దిశగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో కేరళలో కూడా LDF అధికారాన్ని కోల్పోయేలా ఉంది... కాంగ్రెస్ సారథ్యంలోని UDF అధికారాన్ని చేపట్టేలా కనిపిస్తోంది.

24
కేరళలో బిజెపి గెలిచే స్థానాలివే..

ఆసక్తికరంగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు కీలక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. నేమమ్, పాలక్కాడ్, కోజికోడ్ సౌత్, తిరువల్లా నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీటిలో నేమమ్, పాలక్కాడ్‌లో బీజేపీకి మంచి పట్టు ఉందని ముందునుంచే అంచనాలున్నాయి. కానీ, కోజికోడ్ సౌత్, తిరువల్లాలో కూడా పార్టీ అనూహ్యంగా ఆధిక్యం చూపించడం విశేషం.

34
ఆధిక్యంలో కేరళ బిజెపి చీఫ్..

ఈ నాలుగు స్థానాల్లో వరుసగా రాజీవ్ చంద్రశేఖరన్, శోభా సురేంద్రన్, నవ్య హరిదాస్, అనూప్ ఆంటోనీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే కాసర్‌గోడ్‌లో ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత వెనకబడింది. పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కాజకూట్టం నియోజకవర్గంలో మాత్రం బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.

44
కేరళ కాంగ్రెస్ కూటమిదే...

ఎగ్జిట్ పోల్స్ అంచనాలనే నిజం చేసేలా కేరళ పలితాలు వెలువడుతున్నాయి. పినరయి విజయన్ సారథ్యంలో అధికార లెప్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) చతికిలపడింది... కాంగ్రెస్ నాయకత్వంలోని UDF (United Democratic Front) స్పష్టమైన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళుతోంది. బిజెపి కూడా కొన్నిస్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories