Karnataka Assembly Election: పోలింగ్ బూత్ కు న‌వ‌వ‌ధువులు.. క్యూలో ప్ర‌ముఖులు.. క‌ర్నాట‌క ఎన్నిల‌క సిత్రాలు !

First Published May 10, 2023, 11:31 AM IST

Karnataka Assembly Election: కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ షురూ అయింది. బుధ‌వారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగ‌నుంది. బీజేపీ మరోసారి వరుసగా అధికారంలోకి రావాలని భావిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రాల రివాల్వింగ్ డోర్ ట్రెండ్ పై దృష్టి సారించింది. 61 సీట్లకు పైగా బలం ఉన్న జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పోలింగ్ బూత్ కు న‌వ‌వ‌ధువు, క్యూలో రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఇలా క‌ర్నాట‌క ఎన్నిల‌క పోలింగ్ సిత్రాలు.. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయిన వెంట‌నే ప్రజలు ఓటు  వేసేందుకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ న‌వ‌ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకోనహళ్లిలోని పోలింగ్ బూత్ నెంబర్ 165లో ఓ వధువు తన ఓటు వేసింది. అయితే ఓవైపు పెళ్లి వేడుక ఉన్నప్పటికీ.. బాధ్యతగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వధువుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జగదీశ్ శెట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ... బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం ఉందన్నారు. నేనెప్పుడూ ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేశాను. ఒక సంస్థ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిషేధించవచ్చని, ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నేను చాలాసార్లు చెప్పాను" అని ఆయ‌న పేర్కొన్నారు. 

రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై త‌న ఓటు హ‌క్కును వినియోగించున్నారు.  బొమ్మై తన కుమారుడు భరత్ బొమ్మై, కుమార్తె అదితి బొమ్మైతో కలిసి శిగ్గంవి పట్టణంలోని ప్రభుత్వ కన్నడ సీనియర్ మోడల్ బాలుర పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 102లో ఓటు వేశారు.
 

చిత్రదుర్గలోని కురుబరహట్టి పోలింగ్ బూత్ లో వెనుకబడిన వర్గాలకు చెందిన సాధువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Karnataka assembly Election

శివమొగ్గలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75 నుంచి 80 శాతం ఓటర్లు బీజేపీకి మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందనీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 130-135 సీట్లు గెలుస్తామ‌ని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు.
 

ఉత్తర కర్ణాటకలోని సిర్సిలో ఓటు వేసేందుకు అమెరికా నుంచి వచ్చిన అశ్విన్ రాజశేఖర్ భట్.. తన  ఓటు హక్కును  ఉపయోగించుకున్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

click me!