ఇండియన్లకు బంగారంపై మక్కువ ఎక్కువ. పెళ్లిళ్లు, పండుగలు సందర్భం ఏదైనా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు కోసం ఇండియన్లు పోటీ పడుతుంటారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. అయితే పసిడి పరుగుకు బ్రేక్ పడింది. ధరలు కొంత తగ్గాయి.