అదనపు కట్నం వేధింపులు : భార్యతో భర్త అసహజ శృంగారం, మామ లైంగిక వేధింపులు.. తట్టుకోలేక ఆమె చేసిన పని...

Published : May 08, 2023, 09:52 AM IST

పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనంగా మరింత కట్నం తేవాలని వేధింపులకు పాల్పడ్డాడో భర్త. భార్య దానికి ఒప్పుకోలేదు. దీంతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. 

PREV
17
అదనపు కట్నం వేధింపులు : భార్యతో భర్త అసహజ శృంగారం, మామ లైంగిక వేధింపులు.. తట్టుకోలేక ఆమె చేసిన పని...

భోపాల్ : గ్వాలియర్‌లోని ఒక మహిళ తన భర్త రూ. 10 లక్షలు, కారు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని.. అవి ఇవ్వడం తమ వల్ల కాదని చెప్పడంతో.. కోపంతో తనతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. 

27

తన భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేశాడని మహిళ ఆరోపించింది. భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ప్రయత్నించినా.. అతడు అర్థం చేసుకోలేదని పోలీసులకు తెలిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొంచ్ జలౌన్‌లో చోటు చేసుకుంది.

37

చివరికి ఆ కసాయి భర్త బాధితురాలిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె గ్వాలియర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై శనివారం అసహజ అత్యాచారం, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. 

47

వివరాల్లోకి వెడితే.. 24 ఏళ్ల బాధితురాలి వివాహం ఉత్తరప్రదేశ్‌ వ్యక్తితో జరిగింది. పెళ్లి సమయంలో పుట్టింటి వారు రూ.15 లక్షలతో పాటు బంగారు, వెండి నగలు, ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చారు.

57

అయితే కట్నంతో పాటు రూ.10 లక్షలు, కారు కూడా ఇవ్వాలని భర్త, అత్తమామలు డిమాండ్ చేయడంతో వారి కాపురంలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ డిమాండ్లను అంగీకరించడానికి బాధితురాలు నిరాకరించడంతో, ఆమె భర్త ఆమెతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడు. 

67

దీంతో పాటు ఒంటరిగా ఉన్నప్పుడల్లా మామ తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పినా పట్టించుకోలేదు. 

77

ఆమె ఈ విషయాన్ని భర్త, అత్త, కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా వారంతా ఆమెనే తప్పుపట్టారు. చివరికి ఇంట్లోనుంచి గెంటేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!

Recommended Stories