నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

First Published Jul 8, 2021, 12:02 PM IST

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం. 

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
undefined
శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.
undefined
1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా పౌరవిమానయాన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో పౌరవిమానయాన మంత్రి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
undefined
కరోనా మహమ్మారి దెబ్బకు విమానయాన రంగం దెబ్బతిన్నది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.
undefined
మాధవరావు సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
undefined
రాజకీయ పరంగా ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టక ముందు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.
undefined
అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు. మాధవరావు తొలుత జనసంఘ్ లో పని చేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. కానీ, జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తరువాతే కేంద్ర మంత్రి పదవి దక్కడం గమనార్హం.
undefined
2002లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జ్యోతిరాధిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.
undefined
అయితే నిరుడు గాంధీ కుటుంబానికి సింధియా కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 20 20 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.
undefined
సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.
undefined
సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.
undefined
click me!