మోడీ నయా టీం : మహిళా శక్తికి పట్టం.. చేనేత చీరల్లో మెరిసిన 11మంది మంత్రులు..

First Published Jul 8, 2021, 9:57 AM IST

ఢిల్లీ : బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో మహిళలకు పెద్దపీట వేశారు ప్రధాని మోడీ. ఏకంగా 11 మంది మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్ మధ్య రాష్ట్రపతి భవన్ లో బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం జరిగింది.

ఢిల్లీ : బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో మహిళలకు పెద్దపీట వేశారు ప్రధాని మోడీ. ఏకంగా 11 మంది మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్ మధ్య రాష్ట్రపతి భవన్ లో బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం జరిగింది.
undefined
మోడీ మంత్రిమండలిలో కొత్తగా చేరిన మహిళామంత్రులు ప్రమాణ స్వీకారానికి చేనేత చీరలు ధరించి రావడం అందర్నీ ఆకట్టుకుంది. రంగురంగుల, తమ తమ ప్రాంతీయ హస్త వైభవాన్ని చెప్పే ఈ చీరలతో అందరూ ఆకట్టుకున్నారు.
undefined
బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీమంత్రిమండలిలో చోటు దక్కిన వారిలో నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, దర్శనా జర్దోష్, ప్రతిమా భూమిక్, శోభా కరంద్లాజే, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మీనాక్షి లేఖీ, అనుప్రియా పటేల్, అన్నపూర్ణదేవిలు ఉన్నారు.
undefined
రెండో విడత ప్రధానిగా మోడీ ఎన్నికైన తరువాత మొదటి కేబినెట్ విస్తరణ ఇది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మహిళా మంత్రుల ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. మంత్రి స్మృతి ఇరాణితో పాటు.. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో అని ట్యాగ్ చేశారు. వారి పేర్లు వరుసగా ఎడమ నుండి దర్శనాజార్దోష్, ప్రతిమభౌమిక్, శోభా కరంద్లాజే, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మీనాక్షి లేఖీ, అనుప్రియా పటేల్, అన్నపూర్ణదేవి" అని ఆమె ట్వీట్ చేశారు.
undefined
అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మహిళా మంత్రులతో కలిసి ఫొటో దిగారు. వారు జెపి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
undefined
దర్శనా జర్దోష్ : గుజరాత్, సూరత్ నుండి లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు దర్శనా జర్దోష్. ఆమె బ్లూ కలర్ సారీతో ఉల్టా పల్లు చీరతో ప్రమాణస్వీకారం చేశారు. ఆమె పక్కన ప్రతీమా భూమిక్, ఎరుపు రంగు అంచున్న పసుపు చీరలో అతి సాధారణంగా హాజరయ్యారు.
undefined
ఆమె పక్కన ప్రతీమా భూమిక్, ఎరుపు రంగు అంచున్న పసుపు చీరలో అతి సాధారణంగా హాజరయ్యారు.
undefined
శోభా కరండ్లజేశోభా కరాండ్లజే పింక్ బోర్డర్‌ ఉన్న బూడిద రంగు సిల్క్ చీర ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. టెక్స్ టైల్ మినిస్ట్రీ నుంచి మార్చబడిన స్మృతి ఇరానీ, అందమైన ఎంబ్రాయిడరీ ఉన్న చందేరి చేనేత చీరలో కనిపించారు.
undefined
మీనాక్షి లేకిమీనాక్షి లేఖీ పింక్ గధ్వాల్ చీరకు, ఎంబ్రాయిడరీ నీలిరంగు అంచుతో.. పెద్ద బొట్టుతో మెరిసిపోయారు. లేఖి ఢిల్లీనుంచి రెండోసారి బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
undefined
డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ లాకెట్టుతో జత చేసిన సాదా క్రీమ్ రంగు చీరలో కనిపించారు. నిరుడుజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్థానిక వస్త్ర వైభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అదే ఈ మంత్రివర్గ విస్తరణలో కనిపించింది.
undefined
అనుప్రియ పటేల్అనుప్రియ పటేల్ కూడా పసుపు రంగు చీర ధరించారు.
undefined
అన్పూర్ణ దేవి పోల్కా డాట్ ప్రింట్ మధుబని చీరలో అన్ పూర్ణదేవి ప్రమాణ స్వీకారం చేశారు.
undefined
click me!