Reliance Jio
Reliance Jio : ప్రముఖ టెలికాం సర్విసెస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో నెట్ వర్క్ సమస్య ఎదురయ్యింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో జియో కస్టమర్లు నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో జియో వినియోగదారులు భగ్గుమంటున్నారు.
jio
ఎలాంటి సమాచారం లేకుండా కస్టమర్లను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న జియోపై సోషల్ మీడియా వేదికన సీరియస్ అవుతున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం నుండి జియో నెట్ వర్క్ రావడంలేదని... చాలా సర్వీసులను ఉపయోగించుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు జియో యాప్ కూడా పనిచేయడంలేదు? అసలు ఏం జరుగుతోంది? అంటే ఎక్స్ వేదికన ప్రశ్నిస్తున్నారు.
jio
తాము ఎదుర్కొంటున్న సమస్యను స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పెడుతున్నారు. ముంబైలోనే నెట్ వర్క్ సమస్య వున్నట్లు సోషల్ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతోంది.అయితే జియో మాత్రం ఇప్పటివరకు ఈ సమస్యపై స్పందించలేదు.
jio
ట్రాకింగ్ వెబ్ సైట్ 'డౌన్ డిటెక్టర్' కూడా జియో నెట్ వర్క్ సమస్యపై స్పందించింది. సెప్టెంబర్ 17,2024 అంటే మంగళవారం జియో వినియోగదారులు నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారు... ఈ రోజు 12.18 గంటల వరకు 10,367 నెట్ వర్క్ సంబంధిత సమస్యపై వచ్చాయిన్నారు. వీటిలో అత్యధికం సిగ్నల్ లేకపోవడానికి చెందినవి కాగా మిగతావి ఇతర సమస్యలు వున్నాయి.
jio
అయితే ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, వొడా ఫోన్ తో పాటు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎస్ఎల్ సేవల ఎలాంటి అంతరాయం లేకుండా అందుతున్నాయి. కాబట్టి జియో లోనే ఏదయినా సాంకేతిక సమస్య ఎదురయి వుంటుందని భావిస్తున్నారు. ఎప్పటివరకు ఈ సమస్య పరిష్కారం అవుతుందో చూడాలి.