Published : Nov 23, 2024, 04:37 PM ISTUpdated : Nov 23, 2024, 04:45 PM IST
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు తలకిందులయ్యాయి. అంచనాలను మించి అద్భుత ప్రదర్శన కనబర్చిన హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని, పాలనా పగ్గాలను అందుకోబోతున్నారు.
Jharkhand Assembly Election Results 2024 : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హేమంత్ సోరేన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లలో విజయం దిశగా అడుగులు వేస్తోంది... ఇందులో ఇప్పటికే 7 స్థానాల్లో విజయం సాధించి మరో 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అయితే 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్ లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించేలా కనిపించడంలేదు. కానీ జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసాయి. కాబట్టి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్న 16 స్థానాలను కలుపుకుంటే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటుంది. దీంతో మరోసారి హేమంత్ సోరేన్ కు సీఎం పదవి ఖాయంగా కనిపిస్తోంది.
23
Jharkhand Assembly Election Results 2024
జార్ఖండ్ ఫలితాలు ఇలా వున్నాయి :
జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) - 27 స్థానాల్లో ఆధిక్యం - 7 చోట్ల విజయం - మొత్తం 34 స్థానాల్లో గెలుపు అవకాశం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) - 19 స్థానాల్లో ఆధిక్యం - 1 చోట విజయం - మొత్తం 20 స్థానాలకు గెలుచుకునే అవకాశం
కాంగ్రెస్ పార్టీ - 15 చోట్ల ఆధిక్యం - ఒకచోట విజయం - మొత్తం 16 స్థానాలను గెలుచుకునే అవకాశం
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) - 4 చోట్ల ఆధిక్యం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్-లెనినిస్ట్) - ఒకచోట ఆధిక్యం - ఒకచోట విజయం (2 స్థానాలను గెలుచుకునే అవకాశం)
33
Jharkhand Assembly Election Results 2024
హేమంత్ సోరెన్ రికార్డ్ బ్రేక్ విజయం :
జార్ఖండ్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వం మారడం ఖాయం... గత 24 ఏళ్లుగా ఇదే జరిగింది. కానీ తాజాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈ రికార్డును బద్దలుగొట్టింది. వరుసగా రెండోసారి హేమంత్ పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు.
జార్ఖండ్ లోని మొత్తం 81 సీట్లకు గాను ఇండియా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి కేవలం 25 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.