Maharashtra Assembly Election Results 2024 : దేశ రాజకీయాలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో బిజెపి కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల పలితాలు నేడు(శనివారం) వెలువడుతున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడికి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు, పలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
24
Maharashtra Assembly Election Results 2024
పార్టీలవారిగా పరిశీలిస్తే... మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బిజెపి ఇప్పటికే సెంచరీ మార్క్ దాటేసింది. ఆ పార్టీ 100కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన హాఫ్ సెంచరీ కొట్టింది... 50 కి పైగా సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్ లో వున్నారు. ఇదే కూటమిలోని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి 32 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాయుతి కూటమిలోని ఇతర చిన్నపార్టీలు మరో 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా మహాయుతి కూటమి 200కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
34
Maharashtra Assembly Election Results 2024
కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. మొత్తం 288 సీట్లలో కేవలం 86 చోట్ల మాత్రమే ఎంవిఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీదే అత్యంత దారుణ ప్రదర్శన. ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 23, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి 30 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంటే కాంగ్రెస్ కేవలం 29 సీట్లకే పరిమితం అయ్యింది. అత్యధిక సీట్లలో పోటీచేసిన కాంగ్రెస్ అతి తక్కువ సీట్లు సాధించేలా కనిపిస్తోంది.
44
కీలక అభ్యర్థుల పరిస్థితి ఇలా...
కరాడ్ అసెంబ్లీ స్థానంలో మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ వెనకంజ
ఉద్దవ్ థాక్రే తనయుడు, వర్లి శివసేన అభ్యర్థి ఆదిత్య థాక్రే లీడింగ్
బారామతిలో అజిత్ పవార్ ఆధిక్యం
కొప్రి అసెంబ్లీ స్థానంలో ఏక్ నాథ్ షిండే ఆధిక్యం
నాగ్ పూర్ సౌత్ లో డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఆధిక్యం