ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో చాలామంది రైల్వేలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. క్రిస్మస్ పండగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది హాలిడే ప్రయాణానికి సిద్దమయ్యారు. ఇక సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
అయితే చివరి నిమిషంలో టికెట్లు దొరకవు కాబట్టి ముందునుండే రైల్వే టికెట్ల బుకింగ్ కు ప్రయత్నిస్తున్నారు. కానీ తరచూ ఇలా ఐఆర్ సిటిసి వెబ్ సైట్ డౌన్ అవుతుండటంతో వీరు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలలో ఐఆర్ సిటిసి వెబ్ సైట్ లో సమస్య తలెత్తడం ఇది రెండోసారి.