IRCTC వెబ్ సైట్ డౌన్ ... రైల్వే టికెట్లు బుకింగ్ సమస్య 

First Published | Dec 26, 2024, 11:06 AM IST

ఇండియన్ రైల్వే బుకింగ్స్ కోసం ప్రయత్నించే ప్రయాణికులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఐఆర్ సిటిసి వెబ్ సైట్ డౌన్ కావడంతో ఈ సమస్య తలెత్తింది.

IRCTC

IRCTC (Indian Railway catering and tourism Corporation) అధికారిక వెబ్ సైట్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. 

IRCTC

ఇవాళ(గురువారం) ఐఆర్ సిటిసి యాప్ ఓపెన్ చేయగానే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. 'మెయింటెనెన్స్ కారణంగా ప్లాట్ ఫారం పనిచేయట్లేదు' అనే మెసేజ్ చూపిస్తోంది. దీంతో రైల్వే టికెట్స్ బుకింగ్ కోసం IRCTC యాప్ ను ఆశ్రయించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 


IRCTC

అయితే ఇదంతా కుట్రగా ఓ ఎక్స్ యూజర్ పేర్కొన్నాడు. 'ప్రతిరోజు ఉదయం 10 గంటలకు IRCTC వెబ్ సైట్ డౌన్ పనిచేయదు. మళ్లీ ఓపెన్ చేయగానే తత్కాల్ టికెట్స్ అన్ని బుక్ అయిపోతాయి. కేవలం అధిక ధర టికెట్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీంతో డబుల్ రేట్లకు టికెట్స్ కొనాల్సిన పరిస్థితి'' అంటూ ఎక్స్ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధాని మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేసి ట్వీట్ చేసాడు. 

IRCTC

ఇలా తాజాగా ఐఆర్ సిటిసి వెబ్ సైట్ పనిచేయకపోవడంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 'ఇండియా చంద్రుడిని చేరుకుంది. కానీ ఇప్పటికీ ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్ కేవలం తత్కాల్ టికెట్స్ ను కూడా సమస్యలు లేకుండా అమ్మలేకపోతోంది. రాకెట్ సైన్స్ కంటే టికెట్ బుకింగ్స్ యాప్ నిర్వహన కష్టమేమో' అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

Latest Videos

click me!