Indian Railway
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అనేక వసతులను అందిస్తోంది. రైల్వే ప్రయాణ సమయంలో ఏదయినా అసౌకర్యం కలిగితే ప్రయాణికులు మరిన్ని సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు. అలాంటి ఉచిత సౌకర్యాలేమిటో తెలుసుకుంటే అవి రైల్వే ప్రయాణ సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
చాలా మంది ప్రయాణికులకు రైల్వే అందించే ఉచిత సౌకర్యాల గురించి తెలియదు. రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి రూపొందించిన అనేక ఉచిత వసతులను కేవలం టికెట్ కొనడంద్వారా పొందవచ్చు.వెయిటింగ్ రూమ్, బెడ్డింగ్ నుండి వైద్యం వరకు ఇండియన్ రైల్వేస్ ఉచితంగా అందించే వసతుల గురించి తెలుసుకుందాం.
Indian Railway
రైల్వే లోని ఏసీ 1, ఏసీ 2, ఏసీ 3 బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఒక దుప్పటి, దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ వంటి బెడ్డింగ్ ఉచితం. అయితే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారు ఈ సేవ కోసం ₹25 చెల్లించాలి. ఇక కొన్ని రైళ్లలో, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు అదనపు ఛార్జీ చెల్లించి బెడ్డింగ్ పొందవచ్చు.
Indian Railway
మీ రైలు ప్రయాణంలో మీరు అనారోగ్యానికి గురైతే ఇండియన్ రైల్వే ఉచిత ప్రథమ చికిత్స అందిస్తుంది. తీవ్రమైన పరిస్థితి ఏర్పడితే మరింత మెరుగైన వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేస్తారు. ఈ వైద్య సదుపాయాలను పొందడానికి ప్రయాణికులు టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు లేదా ఇతర అధికారులను సంప్రదించవచ్చు.
రాజధాని, దురంతో లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఉచితంగానే భోజనం లభిస్తుంది.
Indian Railway
ఊహించని విధంగా రైళ్లు ఆలస్యం అయితే మరిన్ని సేవలు పొందవచ్చు. రైలు ఆలస్యం కారణంగా స్టేషన్లలో వేచి ఉన్నవారికి ఇండియన్ రైల్వే ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ రూమ్‌లను అందిస్తుంది. ఈ గదులను ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు రైలు టికెట్ చూపించాలి.
Indian Railway
ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లాక్ రూమ్‌లు, లాకర్ గదులు ఉంటాయి. అక్కడ ప్రయాణికులు తమ సామానును సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ సేవలకు కొంత ఛార్జీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ తాత్కాలికంగా తమ వస్తువులను భద్రపర్చుకోవాల్సిన వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఇలా ఇండియన్ రైల్వేలో ఉచితంగానే బెడ్డింగ్, వైద్య సంరక్షణ పొందవచ్చు. అలాగగే సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలు ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికులు ఈ వసతులను ఉపయోగించుకొని తమ ప్రయాణాన్ని సుఖంగా చేసుకోవచ్చు.