IRCTC Kedarnath Yatra: హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ యాత్ర.. టికెట్ బుకింగ్ ప్రాసెస్, ముఖ్యమైన విషయాలు ఇవే

Published : Nov 09, 2026, 04:29 PM IST

IRCTC Kedarnath Yatra: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ బాబా కేదార్‌నాథ్ దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఐఆర్‌సీటీసీ కేదార్‌నాథ్ హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం

ఛార్ ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన శ్రీ బాబా కేదార్‌నాథ్ దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక సూపర్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు ఇప్పుడు తమ ఇంట్లోనే కూర్చుని ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేదార్‌నాథ్ హెలికాప్టర్ టికెట్లను చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అయితే శీతాకాలం ప్రారంభమవుతుండటంతో నవంబర్ 11న ఆలయ తలుపులు మూసివేయనున్నారు. కాబట్టి ప్రయాణం చేయాలనుకునే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

ప్రభుత్వ రంగానికి చెందిన ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో అక్టోబర్ 9న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ లైవ్‌లోకి వచ్చింది. హేమకుండ్ సాహిబ్ తర్వాత హెలికాప్టర్ బుకింగ్ సదుపాయం పొందిన రెండవ పుణ్యక్షేత్రంగా కేదార్‌నాథ్ నిలిచింది. నవంబర్ 11 నుంచి శీతాకాలం కారణంగా కేదార్‌నాథ్ ఆలయం మూసివేయనున్నారు.

25
ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల విక్రయం

కేదార్‌నాథ్ హెలికాప్టర్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ఒక ప్రత్యేకమైన వెబ్‌పేజీని సిద్ధం చేసింది. టికెట్లు కేవలం ఈ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తాయి. ఎలాంటి ఆఫ్‌లైన్ కౌంటర్లు అందుబాటులో ఉండవని గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఐఆర్‌సీటీసీ ఈ బుకింగ్ ప్రాసెస్‌ను నిర్వహిస్తోంది. ఇక హేమకుండ్ సాహిబ్ హెలికాప్టర్ టికెట్ల బుకింగ్ సెప్టెంబర్ 22 నుంచి ఇదే పోర్టల్‌లో ప్రారంభమైంది.

35
హెలికాప్టర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

• ప్రయాణికులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.heliyatra.irctc.co.in/ ని ఓపెన్ చేయాలి.

• హోమ్ పేజీలో మీకు హేమకుండ్ సాహిబ్, కేదార్‌నాథ్ హెలికాప్టర్ బుకింగ్ ఆప్షన్లు కనిపిస్తాయి.

• అందులో "Book Ticket" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

• లాగిన్ పేజీకి వెళ్లిన తర్వాత "Create an account" ఎంచుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

• మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు టిక్కెట్ బుక్ చేసుకునే వివరాలు వుంటాయి.

45
బుకింగ్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రయాణ తేదీలు చూడటం సాధ్యపడదు. కాబట్టి మొదట మీ మొబైల్ నంబర్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకుని, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. అలాగే ఆలయ మూసివేత సమయాన్ని, అందుబాటులో ఉన్న తేదీల విండోను చెక్ చేసి ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

55
ఛార్ ధామ్ యాత్ర 2026

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను కలిపి ఛార్ ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్‌ను స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు 11,05,676 మంది భక్తులు దర్శించుకున్నారు.

నాలుగు ధామాల్లోకెల్లా ఇక్కడే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం. ఏప్రిల్ 23న యాత్ర ప్రారంభమైన బద్రీనాథ్‌ను 9,08,619 మంది, గంగోత్రిని 5,28,406 మంది, యమునోత్రిని 5,07,421 మంది భక్తులు సందర్శించారు. ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రమైన హేమకుండ్ సాహిబ్‌ను 55,411 మంది సందర్శించారు.

Read more Photos on
click me!

Recommended Stories