గురువారం మధ్యాహ్నం ఆరుగురు కూలీలు ఓ ఫాంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.
ముంబై : మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
26
=
వారితో పాటు ఉన్న మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని, జిల్లాలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని అధికారి తెలిపారు.
36
ఈ ఘటన ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
46
ఈ సంఘటన సోన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌచా తండాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి ప్రవేశించారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.
56
వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఐదుగురు కార్మికులు అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు. సోన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.
66
జూలై 2022లో, 2019 నుండి మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌ల ప్రమాదకర క్లీనింగ్‌లో 188 మంది మరణించారని ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది.