ఆవుపేడ చికిత్సతో ఫంగల్ ఇన్ ఫెక్షన్ల ప్రమాదం.. డాక్టర్ల హెచ్చరిక..

First Published | May 12, 2021, 11:15 AM IST

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తే  ప్రమాదంఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదంఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
undefined
కరోనా వైరస్ సోకకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకంతో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ విశ్వ విద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు.
undefined

Latest Videos

ప్రతి ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి, ఆవుపేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు.
undefined
కొద్దిసేపయ్యాక ఆవుపాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసే వారు కూడా ఈ చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.
undefined
దీనిపై గుజరాత్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో... దీని ద్వారా కోవిడ్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో.. ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్ లంకర్ పేర్కొన్నారు.
undefined
పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేద చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా వైద్యులను సంప్రదించాలి. అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం చైర్ పర్సన్ డాక్టర్ మోనా దేశాయ్ చెప్పారు.

click me!