లాక్‌డౌన్ ఎఫెక్ట్: ముంబై నుండి స్వగ్రామానికి కాలినడకన గర్భిణీ

First Published | May 6, 2020, 1:54 PM IST

వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కష్టాలు పడుతున్నారు. మహా నగరాల్లో ఉపాధి లేని కారణంగా స్వంత గ్రామానికి పయనమయ్యారు. ప్రభుత్వాలు వలస కూలీలను తమ రాష్్ట్రాల్లోనే ఉండాలని కోరుతున్నా కూడ కూలీలు మాత్రం వినడం లేదు.

స్వంత గ్రామానికి వెళ్లేందుకు ఓ గర్భిణీ ఇతర కూలీలతో కలిసి నడుచుకొంటూ వెళ్తోంది. చిన్నారులను తమ భుజాలపై ఎత్తుకొని మరికొందరు గ్రామం బాట పట్టారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 17వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ సమయంలో పనులు లేక వలస కూలీలు తమ స్వగ్రామాల బాట పడుతున్నారు.

లాక్‌డౌన్ వలస కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పొట్టకూటికోసం వలస వచ్చిన కార్మికులు లాక్‌డౌన్ తో తమ స్వగ్రామాలకు వలసవెళ్తున్నారు. పనులు లేక, తిండి దొరకక గంజి నీళ్లు తాగైనా బతికేందుకు స్వంత ఊరు బయలుదేరారు. ఏ రాష్ట్రంలో చూసినా రోడ్ల వెంట మూటలతో వలస కార్మికులు నడుచుకొంటూ వెళ్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి.
భీవండి, ముంబైలను కలిపే రోడ్డు మార్గంలో వలస కూలీలు బుధవారం నాడు ఉదయం తమ వస్తువులతో కాలినడకన బయలుదేరారు. వలసకూలీలు తమ గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తాయని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ రైళ్లలో వెళ్లకుండా వీరంతా కాలినడకన బయలుదేరారు.
నవీ ముంబైలోని గన్‌సోలి నుండి మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతానికి కాలినడకన బయలుదేరారు. గన్ సోలి నుండి బుల్తానాకు 480 కి.మీ దూరం ఉంటుంది. చిన్న పిల్లలు, గర్భిణీ మహిళ కూడ వలసకూలీల్లో ఉన్నారు.
మంగళవారం నాడు సాయంత్రం వలసకూలీలు తమ గ్రామానికి బయలుదేరారు. ఏడు మాసాల గర్భిణీ నిఖిత కూడ ఇతరులతో కలిసి నడుస్తోంది. 12 గంటలపాటు ఆమె రోడ్డుపైనే ఉంది.
తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో సరైన భోజన వసతులు లేవని నిఖిత ఓ మీడియా ఛానెల్ కు చెప్పారు. వర్షాలు ప్రారంభమైతే ఈ ప్రాంతంలో ముంబైలో తమకు ఆహారం, కనీసం నీళ్లు కూడ దొరకని పరిస్థితి ఉండదని కూలీలు చెప్పారు.
మరో వైపు ముంబై పట్టణంలోని మరో ప్రాంతం నుండి కూడ వలస కూలీలు తమ గ్రామం బాట పట్టారు.ఓ మహిళ తన భుజంపై ఓ అబ్బాయిని కూర్చోబెట్టుకొంది. మరో వైపు చంకలో మరో బిడ్డను ఎత్తుకొని స్వంతగ్రామానికి పయనమైంది. 15 మంది వలస కూలీలు ముంబై నుండి సైకిల్ పై బీహార్ రాష్ట్రానికి బయలుదేరారు.
ముంబైలోని శాంతాక్రజ్ నుండి బీహార్ లోని దర్భాంగకు బుధవారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరారు. రైళ్లలో ఈ నెల 14వ తేదీ తర్వాత పంపుతామని అధికారులు చెప్పడంతో తాము సైకిళ్లపై బయలుదేరినట్టుగా వారు చెప్పారు.
తమ సైకిళ్లపై కొన్ని దుస్తులు, బియ్యం వంటి సరుకులను పెట్టుకొన్నారు. వీరంతా కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నారు. తమకు కరోనా లేదని తేలిందని వలస కూలీలు తెలిపారు.

Latest Videos

click me!