మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : రెండో పెళ్లి పేరుతో రూ.37లక్షలు కాజేసి.. డాక్టర్ కు అమెరికా యువతి కుచ్చుటోపి...

Published : Apr 24, 2023, 09:39 AM IST

అమెరికా మహిళగా నటిస్తూ ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఓ వైద్యుడి నుంచి రూ.35 లక్షలు మోసం చేసిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

PREV
16
మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : రెండో పెళ్లి పేరుతో రూ.37లక్షలు కాజేసి.. డాక్టర్ కు అమెరికా యువతి కుచ్చుటోపి...

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో మరో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ వెలుగు చూసింది. ఈసారి.. చెన్నైలోని డాక్టర్ కి అమెరికాలోని ఓ యువతి వలవేసి నిండా ముంచింది. ప్రేమ పెళ్లి పేరుతో.. పుదుచ్చేరికి చెందిన ఆ వైద్యుడు దగ్గర నుంచి రూ.37 లక్షలు కొట్టేసి ఫోన్ స్విచాఫ్ చేసింది. రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ డాక్టర్ ని బురిడీ కొట్టించింది అమెరికా యువతి. తాను మోసపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆ డాక్టర్ ఆదివారం నాడు పోలీసులను ఆశ్రయించాడు.

26

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. బాలాజీ (34) అనే వ్యక్తి తమిళనాడు పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.  దీనికోసం ఓ మాట్రిమోనియల్ వెబ్సైట్లో తన వివరాలను పొందుపరిచాడు. అది చూసిన అమెరికాలోని సోము శ్రీ నాయర్ అనే యువతి తాను ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొంది. బాలాజీతో కాంటాక్ట్ అయింది. బాలాజీ పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికే వివాహమై భార్యాభర్తల విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.

36

Once upon a time marriages were made in heaven, but now, the world of dot come is the biggest cupid on the block. Choosing a life partner is an important decision and one just cannot be careful enough while going through the searching process. 

అతడి వయసు 36 ఏళ్లే కావడంతో బాలాజీకి రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో బంధువులు సూచించారు. అందుకు తగ్గట్టుగానే బాలాజీ రెండో పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీలో కూడా సమాచారం ఇచ్చాడు. దీంతో బాలాజీ డాక్టర్ కావడంతో పలువురు ఫోన్ చేసి మాట్లాడేవారు. మ్యాట్రిమోనీ చాట్‌లో బాలాజీకి వారి నుంచి మెసేజ్ లు వచ్చేవి. ఆ విధంగా బాలాజీకి సోమశ్రీ నాయక్ అనే మహిళ పరిచయమయ్యింది. తాను అమెరికాలో డాక్టర్‌ చదువుకున్నానని చెప్పింది. ఆ మహిళ సిరియాలో ఉద్యోగం చేస్తున్నానని కూడా చెప్పింది. 

46

తన వృత్తికి చెందిన మహిళే కావడంతో బాలాజీకి సోమశ్రీ అంటే ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ముందుగా స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులుగానే కొనసాగుతామని ఇద్దరూ అనుకున్నారు. బాలాజీకి ఆ అమ్మాయి బాగా నచ్చింది. మొదటి పెళ్లి వల్ల తనకు కలిగిన మానసిక క్షోభకు సోమశ్రీ మందు అని బాలాజీ బలంగా నమ్మాడు.

56
bride , marriage

ఈ స్థితిలో సోమశ్రీ తనకు హఠాత్తుగా డబ్బు అవసరం వచ్చిందని బాలాజీని వివిధ దఫాలుగా రూ.35 లక్షలు అడిగినట్లు సమాచారం. ఈ డబ్బు ఆమెకు అందిన తరువాత సోమశ్రీ బాలాజీతో మాట్లాడడం తగ్గిపోయింది.బాలాజీ ఫోన్ చేసినా.. తాను బిజీగా ఉన్నానని, అర్జంట్ కేసు ఉందని చెప్పి ఫోన్ పెట్టేసేది. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. చాలాసార్లు కావడంతో బాలాజీకి అనుమానం వచ్చింది. దాంతో బాలాజీ ఆమె మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగాడు.

66

కానీ సోమశ్రీ నుంచి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న తర్వాత సోమశ్రీ బాలాజీతో పూర్తిగా మాట్లాడటం మానేసింది. మోసపోయానని గ్రహించిన బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ కీర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!

Recommended Stories