పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం గురువారం సన్నిహితులు, కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్ ను ఆయన సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లాడారు. అయితే పెళ్లికి కొద్ది గంటల ముందు గుర్‌ప్రీత్ కౌర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి పెళ్లి కూతురి డ్రెస్ లో వున్న ఫోటోను షేర్ చేశారు. "దిన్ షగ్నా ద చద్యా... (నా పెళ్లి రోజు వచ్చేసింది)" అనే క్యాప్షన్ పెట్టారు.