Ajit Pawar: నాన్నా.. అజిత్ పవార్‌తో ప్రయాణిస్తున్నాా మళ్లీ ఫోన్ చేస్తా.. ఇదే ఆ ఎయిర్ హోస్టెస్ చివరి కాల్

Published : Jan 29, 2026, 10:32 AM IST

Ajit Pawar: అజిత్ పవార్‌ విమాన ప్రమాదంలో ఎయిర్ హోస్టేస్ పింకీ మాలిక్ కూడా మరణించింది. ఆమె తన తండ్రితో మాట్లాడిన చివరి కాల్ గురించి తెలిసి ఎంతో మంది బాధపడుతున్నారు. బారామతి విమాన ప్రమాదంలో కాలి బూడిదైన ఐదుగురిలో పింకీ మాలిక్ ఒకరు. 

PREV
14
బారామతి విమాన ప్రమాదం

బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ మరణించారు. ఆయనతో పాటూ మరో ఐదుగురు మరణించారు. ఈ ఘటన దేశం మొత్తానికి కన్నీళ్లు తెప్పించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని ప్రముఖులు ఎంతో మంది సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా కాలి బూడిదైంది. ఆమె తండ్రి తన కూతురు చెప్పిన చివరి మాటలను గుర్తు చేసుకుని ఎంతో బాధపడుతున్నాడు. 

24
తండ్రికి చివరి కాల్

బారామతికి విమానం బయల్దేరే ముందు ముంబై విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అవ్వడానికి ముందు పింకీ మాలి తన తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా, ఈరోజు అజిత్ పవార్‌తో ప్రయాణిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది. అజిత్ పవార్‌ను బారామతిలో డ్రాప్ చేసి, ఆ తర్వాత నాందేడ్‌కు వెళ్తాను. అక్కడ హోటల్ రూమ్ తీసుకుంటాను. అక్కడికి వెళ్లాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం’ అని తండ్రికి చెప్పింది.

34
మళ్ళీ కాల్ రాలేదు

పింకీ మాలి తండ్రి పేరు శివకుమార్. అతను తన కూతురిని తలచుకుని ఎంతో ఆవేదన చెందారు.  అజిత్ పవార్‌తో ప్రయాణం గురించి ఆమె ఎంతో సంతోషంగా తండ్రితో చెప్పుకుంది. ఇక పింకీ మాలి తండ్రి శివ   ఎన్సీపీ కార్యకర్తగా కూడా పనిచేశారు. అలాంటిది తన కూతురు అజిత్ పవర్ విమానంలో ఉండడం తనకు గర్వంగా అనిపించిందని ఆయన చెప్పారు. కానీ విమానం ప్రమాదం గురించి తెలిశాక షాక్ తగిలినట్టు చెప్పాడు. నా కూతురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది అని శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిన కూతురు ఇప్పుడు లేదు.. నాకేమీ తోచడం లేదు. నాకూతురిని కోల్పోయాను. నాకు ఎలాంటి సాంకేతికత గురించి తెలియదు. ఆ విమానానికి ఏమైందో తెలియదు. నా కూతురైతే తిరిగి రాదు. కనీసం నా కూతురి మృతదేహాన్ని ఇవ్వండి. ఆమెకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

44
ముంబైకి చెందిన పింకీ

పింకీ మాలి కుటుంబం ముంబైలోని వర్లీలో నివసిస్తోంది. ఆమె గత ఐదేళ్లుగా ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. ఆమె తన తమ్ముడిని పైలట్ చేయాలని కలలు కంది. తాను పైలట్ కావాలనుకున్నా కాలేకపోయింది అందుకే తమ్ముడిని పైలట్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం తమ్ముడికి తన డబ్బే ఖర్చు పెట్టి చదివించింది. 

ఇక బారామతి విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అజిత్ పవార్, డీసీఎం పవార్ భద్రతా సిబ్బంది విదిప్ జాదవ్, విమాన సిబ్బంది పింకీ మాలి, పైలట్ శాంభవి పాఠక్, సుమిత్ కపూర్ మరణించారు. 

Read more Photos on
click me!

Recommended Stories