అబ్బురపరిచే రాఫేల్ జెట్ విన్యాసాలు.. తొలిసారిగా చిత్రాలు విడుదల చేసిన వైమానిక దళం

First Published Oct 4, 2021, 5:08 PM IST

రాఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ అద్భుత విన్యాసాలు చేశాయి. స్కాల్ప్ క్షిపణులను మోసుకెళ్తున్న రాఫేల్ జెట్‌ల విమానాల చిత్రాలను వైమానిక దళం తొలిసారిగా విడుదల చేసింది. 
 

rafale

న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఏవియేష్ సంస్థ డసో నుంచి కొనుగోలు చేసిన రాఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ విన్యాసాలు చేసింది. శత్రు దేశాల రాడార్లకూ చిక్కకుండా టార్గెట్‌లను ధ్వంసం చేసే స్కాల్ప్  క్షిపణులను మోసుకెళ్తూ అద్భుతంగా గాల్లో ఎగిరింది. స్కాల్ప్ క్షిపణులను మోసుకెళ్తూ చేసిన విన్యాసాల తాలూకు అబ్బురపరిచే చిత్రాలను భారత వైమానిక దళం తొలిసారిగా విడుదల చేసింది.

rafale

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ చిత్రాలను ట్విట్టర్‌లో విడుదల చేసింది. రాఫేల్ యుద్ధ విమానం ఈ స్కాల్ప్ క్షిపణిని సెంటర్‌లైన్ పైలాన్‌లో మోసుకెళ్తున్నట్టు చిత్రాలు వెల్లడించాయి. ఫ్యూస్‌లెజ్ మధ్యభాగంలో సెంటర్‌లైన్ పైలాన్‌ ఉంటుంది.

rafale

యురోపియన్ డిఫెన్స్ దిగ్గజం ఎంబీడీఏ ఈ స్కాల్ప్ క్షిపణులను తయారు చేసింది. ఈ క్షిపణులు శత్రుదేశాల్లో లోతైన లక్ష్యాలను సులువుగా ఛేదించగలవు. తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించి రాడార్లనూ తప్పించుకోగలవు.  గల్ఫ్ వార్‌లో వీటిని యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌లు వినియోగించాయి.

rafale

భారత వైమానిక దళంలో ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. స్కాల్ప్ క్షిపణులు దళానికి మరింత పరిపుష్టం చేస్తున్నాయి. రాఫేల్ జెట్లను భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. 36 రాఫేల్ జెట్ల కోసం రూ. 59వేల కోట్ల డీల్ కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే 26 యుద్ధ విమానాలు మనదేశానికి వచ్చాయి.

click me!