Bharat Bandh: ఏయే రాష్ట్రాల్లో ఎలా జరిగిందంటే..!?

First Published Sep 27, 2021, 4:42 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు నేతలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు విజయవంతమైంది. దేశవ్యాప్తంగా శాంతియుతంగా భారత్ బంద్ పాటించారు. మెజార్టీ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండగా, మహారాష్ట్రలో స్వల్ప ప్రభావమే ఉన్నది. భారత్ బంద్ విజయవంతమైందని రాకేశ్ తికాయత్ అన్నారు.

bharat bandh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు అమల్లోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా రైతు సంఘాలు సోమవారం భారత్ బంద్ పాటించాలని పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఐక్య వేదికగా వేలాది మంది రైతులు కనీసం పది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. మూడు సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, వాటితోపాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో రైతులు ధర్నాలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో రైతులు అక్కడ ఆందోళనలు చేస్తున్నారు.

delhi- gurugram border area

తమ డిమాండ్లను పేర్కొంటూ దేశమంతటా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటించాలని ఎస్‌కేఎం పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల  నుంచీ మద్దతు లభించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాల నుంచీ సంఘీభావం లభించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ, ఎస్పీ, టీఎంసీ, ఆప్, వైసీపీ, వామపక్షాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
 

punjab

సోమవారం పాటించిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరులో లేదు. ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో బంద్ ప్రభావం అత్యధికంగా ఉండగా మహారాష్ట్రలో సాధారణ జనజీవనంలో ఎలాంటి అవాంతరాలు కలుగలేదు.

haryana

పంజాబ్‌లో మొత్తం 350 చోట్ల ధర్నాలు జరిగాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే ట్రాక్‌లను ఆందోళనకారులు బ్లాక్ చేశారు. వాణిజ్య సముదాయాలు, సహా ఇతర షాపులు మూసివేశారు. హర్యానాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా కనిపించాయి.

bengal

రాజస్తాన్‌లో చాలా చోట్ల రైతులు ర్యాలీలు తీశారు. చాలా చోట్ల వ్యవసాయ మార్కెట్లు, షాపులు మూసేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా సలాయ్ ఏరియాలో రైతులకు మద్దతుగా ఆందోళన జరిగింది. ర్యాలీ తీస్తూ
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసేశారు. పోలీసులు కొంత మంది ఆందోళనకారులనూ అదుపులోకి తీసుకున్నారు.

karnata bengaluru

మహారాష్ట్ర, ముంబయిలలో సాధారణ జనజీవనంలో ఎలాంటి మార్పులు లేకుండా ఈ రోజు గడిచిపోయింది. రవాణా సదుపాయాలు, షాప్, ఇతర సౌకర్యాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాయి.
 

kerala

ఢిల్లీలో, ఢిల్లీ యూపీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రోడ్లపై రైతు ఆందోళనకారుల ధర్నాలతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి.

rajasthan

తాము పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసిందని, అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతమైందని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. తాము అన్ని సదుపాయాలు మూసేసి ప్రజలకు అసౌకర్యం కల్పించాలని భావించలేదని తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ, ఎలాంటి చర్చలు జరగడం లేదని చెప్పారు.

click me!