మధ్యప్రదేశ్ : టమాటా లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. టమాటాలను దొంగతనం చేయడం.. టమాటాల డబ్బుల కోసం హత్యలు చేయడం.. ఇప్పటికే చూశాం... అలాంటి కోవలోకి వచ్చే ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. టమాటాల విషయంలో గొడవ భార్యాభర్తల్ని విడదీసింది.
26
భర్త తనను అడగకుండా టమాటాలు వంటకు వాడాడని అలిగి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు చాలా మంది ప్రజల ఆర్థిక స్థితిపై భారం పెంచుతున్నాయి, ఈ ధర పెరుగుదల మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవకు కూడా కారణమైంది. టొమాటో ధరలు అధికంగా ఉండడంతో గృహిణులు వంటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
36
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి టిఫిన్ వండడం కోసం రెండు టమాటాలు భార్యను అడగకుండా వాడేశాడు. దీంతో భార్య మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
46
Aligarh Husband wants to divorce his wife said married because of father
టిఫిన్ సర్వీస్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ఇటీవల తాను తన భార్యను అడగకుండా భోజనం వండేటప్పుడు రెండు టొమాటోలు వాడానని చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. తనను అడగకుండా వాడాడని ఆమె చిన్నబుచ్చుకుంది.
56
వాగ్వాదం తర్వాత, ఆమె తన కుమార్తెతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. బర్మన్ లేని సమయంలో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. దీంతో కంగారు పడ్డ బర్మన్ వారిని వెతకడానికి ప్రయత్నించాడు.. కానీ వారు దొరకలేదు.. దీంతో చేసేదేంలేక స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
66
భార్య, కూతురు అదృశ్యం మీద సంజీవ్ ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. తాను వండుతున్న కూరలోకి రెండు టమాటాలు వాడడం వల్లే వాగ్వాదం మొదలైందని సంజీవ్ తెలిపాడు. మూడు రోజులుగా తన భార్యతో మాట్లాడలేదని, ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పాడు. సంజీవ్ భార్యను సంప్రదిస్తామని, ఆమె త్వరలో తిరిగి వస్తుందని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.