వివాహేతర సంబంధం : టీనేజర్ ను చంపి, నది ఒడ్డున పాతి పెట్టారు... 18 రోజుల తరువాత వెలుగులోకి...

Published : Jul 12, 2023, 01:18 PM IST

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో 19 ఏళ్ల ప్రేమికుడిని హత్య చేసిన ఆరోపణలపై వివాహిత, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.   

PREV
18
వివాహేతర సంబంధం : టీనేజర్ ను చంపి, నది ఒడ్డున పాతి పెట్టారు... 18 రోజుల తరువాత వెలుగులోకి...

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. చనిపోయిన 18 రోజుల తరువాత ఓ 19 ఏళ్ల బాలుడి మృతదేహం దొరికింది. నది ఒడ్డున పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీశారు. అతడిని అతడి ప్రియురాలు, ఆమె సోదరుడు కలిసి హత్య చేసి, నది ఒడ్డున పూడ్చిపెట్టారు.

28

చనిపోయిన టీనేజ్ బాలుడిని నయన్ గా గుర్తించారు. అతను వివాహిత అయిన శోభాదేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.శోభకు చందీప్ భూయాన్‌తో వివాహం జరిగింది. చందీప్ తో కలిసి నయన్ జేసీబీ డ్రైవర్లుగా పని చేసేవారు.

38

ఈ క్రమంలోనే చందీప్ ఇంటికి తరచూ వెళ్లే నయన్, శోభతో పరిచయం పెంచుకున్నాడు. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో వారిద్దరూ తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు.

48

నయన్‌ తో శోభ అక్రమ సంబంధంగురించి తెలిసిన శోభ భర్త, ఆమె సోదరులు నయన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ప్లాన్‌లో భాగంగా శోభ సోదరుడు నయన్‌తో మాట్లాడేందుకు బర్‌సైతా నది దగ్గరకు పిలిచాడు. మాట్లాడే క్రమంలో కొద్దిసేపటికే వారి మధ్య వాగ్వాదం జరిగింది, అది హింసాత్మకంగా మారింది. 

58

దీంతో శోభ సోదరుడు నయన్‌ను హత్య చేసి నది ఒడ్డున పాతిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత నయన్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు హత్యకు దారితీసిన నిజానిజాలు తెలుసుకున్నారు. అనంతరం శోభతో పాటు ఆమె భర్తపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

68

కేసు నమోదైన తర్వాత శోభ, ఆమె భర్త ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకోవడానికి వెతుకులాట ప్రారంభించారు. రాయ్‌పూర్ లో ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి, అక్కడికి చేరుకున్నారు పోలీసులు.

78

ఆ తరువాత శోభను అరెస్టు చేసి పాలమూలో అదుపులోకి తీసుకున్నారు.నయన్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని విచారణ సందర్భంగా శోభ పోలీసులకు చెప్పిందని మదీనీనగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డిపిఓ) రిషబ్ గార్గ్ తెలిపారు. నయన్‌ను హత్య చేసి పాతిపెట్టిన ప్రదేశాన్ని కూడా ఆమె వెల్లడించింది.
 

88

"తనను బ్లాక్ మెయిల్ చేయోద్దన నయన్ ను శోభ కోరింది. కానీ అతను వినలేదు. పైగా ఆ విషయానికి ఏ మాత్రం రిగ్రెట్ అవ్వలేదు. దీంతో శోభ, ఆమె సోదరులు అతన్ని చంపారు" అని ఎస్ డీఓపీ తెలిపారు. నయన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు.

click me!

Recommended Stories