ఆ తరువాత జూన్ 3 నుండి, అబ్బాయి,అమ్మాయి ఇద్దరూ కనిపించకుండా పోయారు. రాధేశ్యామ్ తోమర్ కుటుంబం వారిని హత్య చేసిందని అమ్మాయి కుటుంబం పదేపదే ఆరోపించింది. బాలిక కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. తదనంతరం, శివాని తండ్రి రాజ్‌పాల్ సింగ్ తోమర్, పలువురు బంధువులు.. జూన్ 3న శివాని, రాధేశ్యామ్ తోమర్‌లను కాల్చి చంపారని, ఆపై వారి మృతదేహాలను చీకట్లో చంబల్ నదిలో పడవేసారని ఒప్పుకున్నారు.