కొట్టాయం జిల్లాలో కుండపోత వర్షానికి floods పోటెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండ చరియల కింద కొందరు చిక్కుకుపోయారు. ఈ ఏరియాలో వరదల్లో గల్లంతైనవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీంతో ఆర్మీ, NDRF, పోలీసులు, ఫైర్ ఫోర్స్ సహా స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో కొండచరియల శిథిలాల కింద నుంచి మృతదేహాలు వెలికివచ్చాయి. కొట్టాయంలోని కూట్టిక్కాల్‌లో మరో ఐదు మృతదేహాలు శిథిలాల కింద నుంచి సహాయక బృందాలు మధ్యాహ్నానికల్లా వెలికి తీయగలిగాయి. ఇదే ఏరియాలో ముగ్గురు పిల్లల మృతదేహాలు ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నట్టుగా బయటపడటం కలచివేస్తున్నది. ఎనిమిది, ఏడు, నాలుగేళ్ల ఆ పిల్లల మృతదేహాలు రెస్క్యూ సిబ్బందినీ కంటతడి పెట్టించాయి.