దీపావళి తళుకులతో వెలిగిపోతున్న అయోధ్య.. 9 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు

First Published Nov 4, 2021, 1:03 PM IST

దీపావళి సందర్భంగా రామమందిరం నిర్మిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో దీపాలతో తళుకులీనుతున్నది. సరయూ నది తీరాన అధికారులు సుమారు తొమ్మిది లక్షల దీపాలను వెలిగించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. తొమ్మిది లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు సాధించారు. దీపాల వెలుగులు.. లేజర్ కాంతుల ప్రదర్శనతో అయోధ్య నగరం దీపావళి నాడు మెరిసిపోయింది.
 

ayodhya

దీపావళి పండు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది దీపాలే. పిల్లలు, కుర్రాకరు బాణాసంచాపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, బాణాసంచా లేకున్నా.. దీపాలు వెలిగించడం మాత్రం ఆగదు. మారుమూల గ్రామమైనా.. నగరం  నడిబొడ్డునైనా దీపాలంకరణ కచ్చితంగా ఉంటుంది. ఈ దీపాలతో ఇల్లు ముస్తాబవుతుంది. ఈ దీపాలు నివాసాల్లోనే కాదు.. ఆలయాల్లో అంతకు మించి అన్నట్టుగా ఉంటాయి. దీపావళికి ఒకట్రెండు రోజులు ముందు నుంచే మందిరాలు దీపాలతో సింగారించుకుంటాయి.
 

ayodhya

అతిపురాతన పట్టణంగా పేరున్న కాశీ పట్టణం.. అదే అయోధ్యలో దీపావళి రోజు దీపాలు రాత్రిని సవాల్ చేస్తుంటాయి. 

ayodhya

గతేడాదే అత్యధిక దీపాలతో రికార్డు నెలకొల్పారు. ఈ సారి కూడా ఏకంగా గిన్నిస్ రికార్డునే సొంతం చేసుకున్నది అయోధ్య.

ayodhya

బుధవారం రాత్రి అయోధ్యలో సుమారు తొమ్మిది లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది తీరంలో మట్టితో చేసిన దీపాలను ఉంచారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ సారి దాదాపు తొమ్మిది లక్షల దీపాలను ప్రదర్శనకు పెట్టారు.
 

ayodhya

ఒకచోట ఇన్ని దీపాలను వెలిగించడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు. అయోధ్య ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శిశిర్ ఈ రికార్డును పేర్కొన్నారు. తొమ్మిది లక్షల దీపాలను వెలిగించి అయోధ్య నగరం గిన్నిస్ బుక్ రికార్డును సాధించిందని అధికారి శిశిర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రికార్డు పత్రాన్నీ షేర్ చేశారు.
 

ayodhya

ఈ దీపారాధనకు ముందు లేజర్ ప్రదర్శననూ ఉంచారు. ఈ లేజర్ ప్రదర్శన పర్యాటకులకు కనువిందు చేసింది. చాలా మంది సెల్ ఫోన్లు పట్టుకుని రికార్డు చేసుకున్నారు. ఆ లేజర్ కిరణాల్లో మునిగితేలారు. 
 

ayodhya

గతేడాది 5.84 లక్షల దీపాలను వెలిగించారు. అది కూడా గతేడాది ఒక రికార్డే. దీపావళి వేడుకల కోసం గతేడాది కూడా అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు.

click me!