దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండతీవ్రత.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. పలు ప్రాంతాలకు హెచ్చరికలు..

Published : Apr 19, 2023, 09:46 AM ISTUpdated : Apr 19, 2023, 09:51 AM IST

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రోజున ఉష్ణోగ్రతలు  40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. దీంతో ఎండతీవ్రతకు ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారు. 

PREV
19
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండతీవ్రత.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. పలు ప్రాంతాలకు హెచ్చరికలు..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రోజున ఉష్ణోగ్రతలు  40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. దీంతో ఎండతీవ్రతకు ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారు. అత్యవసర పనులు అయితే తప్ప మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు జనాలు వెనుకంజ వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు.

29

పూసా ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలు, పితంపురా ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నమోదుకావడంతో వేడి తీవ్రత అధికంగానే ఉంది. అయితే మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం బుధవారం న్యూఢిల్లీలోని ప్రజలకు వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

39

ఇదిలా ఉంటే.. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ క్రియాశీలకంగా ఉండటంతో వాయువ్య ప్రాంతంలోని మైదానాల్లో మంగళవారం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. అలాగే మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 

49

బీహార్‌లోని పాట్నా, బంకా, జాముయి, నవాడా, ఔరంగాబాద్, సుపౌల్‌తో పాటు అనేక ఇతర జిల్లాల్లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని బెగుసరాయ్, నలంద, గయా, అర్వాల్, భోజ్‌పూర్, రోహతాస్, బక్సర్, ఖగారియా, ముంగేర్ ప్రాంతాలలో ‘‘ఎల్లో’’ హెచ్చరిక కూడా జారీ చేయబడింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్, రాజధాని నగరం కోల్‌కతాలో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

59

హర్యానా, పంజాబ్‌లలో ఎండ తీవ్రత పరిస్థితులు కొనసాగాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్కు కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. హర్యానాలో హిస్సార్‌లో పాదరసం 41.4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడటంతో వేడిగాలులు వ్యాపించాయి. కర్నాల్‌లో కూడా అత్యధికంగా 40.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంబాలాలో 39.7 డిగ్రీల సెల్సియస్, నార్నాల్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్, భివానీలో 39.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్‌లోని భటిండాలో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమృత్‌సర్‌లో 36.6 డిగ్రీల సెల్సియస్, పాటియాలాలో 41.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో అత్యధికంగా 39.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

69

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, హమీర్‌పూర్‌లలో గరిష్టంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాలలో ఏకాంత ప్రదేశాలలో వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. లక్నోలో గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
 

79

ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కోటాలో 42.8 డిగ్రీలు, బన్స్వారాలో 42.7 డిగ్రీలు, ఫలోడిలో 42.2 డిగ్రీలు, ధోల్‌పూర్లో 42 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ 19,20 తేదీల్లో జోధ్‌పూర్‌, బికనీర్‌ డివిజన్లలో తేలికపాటి వర్షాలు, జైపూర్‌, అజ్మీర్‌, భరత్‌పూర్‌ డివిజన్లలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది.

89

మండుతున్న ఎండలతో కొట్టుమిట్టాడుతున్న హిమాచల్‌లోని దిగువ కొండల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎండతీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. ఉనాలో 37.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ధౌలాకువాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 38.7 డిగ్రీలతో నమోదైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, ధర్మశాల, నరకందలో వరుసగా 25.4 డిగ్రీలు, 21 డిగ్రీలు, 28.2 డిగ్రీలు, 19.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

99

కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో తాజాగా మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు.నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని మచిల్‌లో దాదాపు మూడు అంగుళాల హిమపాతం నమోదైంది. శ్రీనగర్ నగరంతో సహా మైదాన ప్రాంతాలలో రాత్రిపూట వర్షం కురిసిందని, దీంతో ఉష్ణోగ్రత తగ్గిందని వారు తెలిపారు. బుధవారం చాలా చోట్ల అడపాదడపా తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఎత్తైన ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉంది.

click me!

Recommended Stories