భార్యను కాటేసిన పాము... ఆస్పత్రికి పామును తీసుకెళ్లిన భర్త

First Published | Apr 18, 2023, 6:53 AM IST

యూపీలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను పాము కరిచింది. ఆస్పత్రిలో భార్యను చూడడానిక రాకుండా.. ఆమెను కరిచిన పామును తీసుకొచ్చాడు. దీనికి ఆ వ్యక్తి చెప్పిన కారణం షాక్ కలిగించింది. 

ఉత్తరప్రదేశ్ : ఉన్నావ్ జిల్లాలోని సఫీపూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్ అత్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు బదులు గోనె సంచిలో పామును ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వంటగదిలో పని చేస్తున్న మహిళను కొండచిలువ పాము కాటువేసింది. వెంటనే ఆమె కేకలు వేస్తూ పడిపోయింది. అది గమనించిన వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత విషయాన్ని భర్తకు సమాచారం ఇచ్చారు. అప్పుడు ఆమె భర్త ఆమెను చూడడానికి రాకుండా, ఆమెను కాటేసిన పామును పట్టుకుని చికిత్స కోసం తీసుకువచ్చాడు. ఇది అందరినీ షాక్ కు గురి చేసింది. 

ఉన్నావ్ జిల్లా సఫీపూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి గోనె సంచినిలో ఓ పామును ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అది చూసిన అక్కడి సిబ్బంది, రోగులు, వైద్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని భార్య కుస్మ పాము కాటుకు గురైనట్లు తెలుస్తోంది. మహిళ వంటగదిలో పని చేస్తుండగా కొండచిలువ పాము కాటు వేసింది. పాము కాటు వేసిన కొన్ని సెకన్ల తర్వాత మహిళ కేకలు వేయడంతో స్పృహతప్పి పడిపోయింది.


వెంటనే మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఈ దురదృష్టకర సంఘటనపై భర్తకు సమాచారం అందించారు. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి తన భార్యను చూసేందుకు పరుగుపరుగు వెళ్లాల్సింది పోయి.. నేరుగా ఇంటికి వెళ్లాడు. ఒక్కసారి కూడా ఆస్పత్రికి రాకపోవడం గమనార్హం. బదులుగా, అతను ఇంటికి వెళ్లి భార్యను కరిచిన పామును పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

పామును చూసిన ఆసుపత్రి అధికారులు కంగుతిన్నారు. పామును ఆసుపత్రికి ఎందుకు తీసుకువచ్చారని ఆ వ్యక్తిని అడిగారు. అతను చెప్పిన సమాధానానికి వారి ఫ్యూజులు అవుటయ్యాయి. తన భార్యను కాటు వేసిన పామును చూసి ఆమెకు వైద్యం చేస్తారని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. కాగా, మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ తుషార్ శ్రీవాస్తవ తెలిపారు.

మఖీ పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, ఓ భర్త పాము కాటుకు గురైన భార్య తోపాటు, పామును కూడా తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. “నా భార్యను ఏ పాము కరిచిందని అడిగితే? ఏం చెప్పాలి? అందుకే  మీరే చూడాలని పామును కూడా తీసుకొచ్చాను’’ అని భర్త డాక్టర్‌తో చెప్పాడు.

Latest Videos

click me!