చింతన్ శిబిర్ కాంగ్రెస్ కి కలిసి వచ్చేనా?

Published : May 16, 2022, 06:51 PM IST

కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శిబిరం నిర్వహించింది. పార్టీ సంస్థాగతంగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది.  50 ఏళ్లలోపు వయస్సున్న వారికే 50 శాతం టికెట్లను ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలపై పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి ఆమోదం తెలిపాయి. పార్టీ  ప్రజలతో సంబంధాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ తెలిపారు. పార్టీతో సంబంధాలను పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు.  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిగణనీలోకి తీసుకొనే అవకాశం ఉంది. 

PREV
చింతన్ శిబిర్ కాంగ్రెస్ కి కలిసి వచ్చేనా?
Cartoon punch On congress chintan shivir

కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శిబిరం నిర్వహించింది. పార్టీ సంస్థాగతంగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది

Read more Photos on
click me!

Recommended Stories