‘నా భర్త వీర్యం కావాలి’... కోర్టు కెక్కిన భార్య.. !

First Published Jul 21, 2021, 11:52 AM IST

అతను చనిపోయినా అతని పిల్లలకు తల్లిగా మారాలని తాను కోరుకుంటున్నానని అందుకే.. అతని వీర్యాన్ని భద్రపరిచి తనకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె హైకోర్టును కోరారు. దీనికి ఆమె అత్తామామలు మద్దతు పలికారు. 

అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో ఓ యువతి భర్త వీర్యాన్ని తనకు అందించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. సదరు భర్త కోవిడ్ సోకి ఆస్పత్రిలో ప్రాణాలుతో పోరాడుతున్నాడు.
undefined
ఆ యువతి, అత్తామామలతో కలిసి కోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది. ఆమె భర్త 29యేళ్ల వ్యక్తి కోవిడ్ తో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. అతను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడు. ఒక్కరోజుకు మించి అతను బతికే అవకాశం లేదని డాక్టర్ తెలిపారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.
undefined
అతను చనిపోయినా అతని పిల్లలకు తల్లిగా మారాలని తాను కోరుకుంటున్నానని అందుకే.. అతని వీర్యాన్ని భద్రపరిచి తనకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె హైకోర్టును కోరారు. దీనికి ఆమె అత్తామామలు మద్దతు పలికారు.
undefined
ఈ పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం వడోదర ఆసుపత్రికి యువతి కోరిన విధంగా మరణిస్తున్న కోవిడ్ -19 రోగి స్పెర్మ్‌ను భద్రపరచాలని ఆదేశించింది. అయితే రోగి దీనికి అంగీకరించే పరిస్థితిలో లేనందు వల్ల ఆసుపత్రి వర్గాలు మొదట్లో ఆమె అభ్యర్థనను తిరస్కరించారు.
undefined
కోవిడ్ తో అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని, అనేక అవయవాలు దెబ్బతిన్నాయని, వెంటిలెటర్ మీద ఉన్నడని అంతేకాదు, పెండింగ్‌లో ఉన్న అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం వ్యక్తి అనుమతి లేకుండా స్పెర్మ్ పొందలేమని వారు తెలిపారు. దీనికోసం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావాల్సి ఉంటుందని వారు తెలిపారు.
undefined
దీంతో ఆ వ్యక్తి భార్య, తల్లిదండ్రులు తమ ఫ్యామిలీ లాయర్ నీలే పటేల్ ద్వారా కోర్టులో ప్లియా వేసింది. వ్యక్తి స్పెర్మ్ ను సేకరించి, కుటుంబసభ్యులకు ఇచ్చేలా డాక్టర్లను ఆదేశించాలని. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని లాయర్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థన మేరకు జస్టిస్ ఆశితోష్ శాస్త్రి విచారణ చేపట్టారు.
undefined
బాధితుడు మే 10న కరోనాతో సదరు హాస్పిటల్ లో చేరాడని.. కాగా వైద్యులు ఇక అతను బతికే అవకాశాలు లేవని.. ఒక్కరోజుకు మించి బతికి ఉండకపోవచ్చని తేల్చారని తెలిపారు. దీంతో ఈ కేసును అత్యవసరంగా పరిష్కరించకపోతే, అది కోలుకోలేని పరిస్థితిని సృష్టిస్తుందని కోర్టు తెలిపింది.
undefined
రోగి స్పెర్మ్ సేకరించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దానిని సంరక్షించాలని ఆసుపత్రిని ఆదేశించింది. అయినప్పటికీ, కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కృత్రిమ గర్భధారణకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఈ కేసును కోర్టు గురువారం విచారించే అవకాశం ఉంది.
undefined
click me!