క్రిస్మస్ పండగవేళ GMail యూజర్లు జాగ్రత్త ... అలాచేసారో మోసపోతారు : గూగుల్ వార్నింగ్

First Published | Dec 19, 2024, 5:01 PM IST

Gmail స్కామ్‌ల పట్ల జాగ్రత్త! ఫిషింగ్ ఈమెయిల్‌లు, నకిలీ షిప్పింగ్ నోటిఫికేషన్‌లు, ఛారిటీ మోసాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి. Gmail భద్రతా ఫీచర్‌లతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

Gmail Scams

క్రిస్మస్ పండగ సందర్భంగా Gmail వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని గూగుల్ హెచ్చరిస్తోంది. ఫేక్ మెయిల్స్ మోసాలు పెరిగిపోయాయి... పండగ పూట కేటుగాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం వుంటుంది. అందువల్ల ఈ  జిమెయిల్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని గూగుల్ హెచ్చరిస్తోంది.

జిమెయిల్ లో ఇప్పటికే భద్రతా ఫీచర్‌లను పెంచింది గూగుల్. అయినా కొందరు వినియోగదారులు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. కాబట్టి ఈ నకిలీ ఈమెయిల్‌ల నుండి వినియోగదారులను సురక్షితంగా ఉంచే సలహాలను అందిస్తోంది గూగుల్. 

Gmail Scams

 స్కామ్‌ల గురించి తెలుసుకోండి

ఫిషింగ్ స్కామ్‌లు, నకిలీ షిప్పింగ్ నోటిఫికేషన్‌లు, ఛారిటీ మోసాలు వంటి వివిధ స్కామ్‌ల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో విరాళం ఇచ్చే ముందు సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోండి.

Gmailలో స్పామ్ ఫిల్టర్‌లు, హెచ్చరిక లేబుల్‌లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వంటి బలమైన భద్రతా ఫీచర్‌లు ఉన్నాయి. ఇవి మోసాల నుండి వినియోగదారులను రక్షిస్తాయి.


సురక్షితంగా ఉండటం ఎలా?

ఇక గుర్తుతెలియని మెయిల్ ఐడీల నుండి వచ్చే మెయిల్‌స్్ లోని అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయవద్దు... లింక్‌లను క్లిక్ చేయడం కూడా మానుకోవాలి. అనుమానాస్పద ఈమెయిల్‌లను రిపోర్ట్ చేయండి.

Latest Videos

click me!