ప్రియురాలు వేరే వ్యక్తితో స్నేహం చేయడం నచ్చలేదు ఆ ప్రియుడికి. అదే విషయం ఆమెకు చెప్పాడు. దీంతో కోపానికి వచ్చిన ఆమె స్నేహితుడితో కలిసి ప్రియుడిని హతమార్చింది.
థానె : మాజీ ప్రియుడిని హత్య చేసిన ఘటనలో ఓ మహిళ, ఆమె స్నేహితుడిని మాన్‌పాడు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులను సంధ్యా సింగ్, గుడ్డు శెట్టిగా గుర్తించారు. మృతుడు ఆమెతో సహజీవనం చేసిన మారుతీ హండేగా గుర్తించారు.
25
ఈ ఘటన శనివారం డోంబివిలిలోని కోలేగావ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా సింగ్, మారుతీ హండే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.అయితే, మారుతీ హండే.. సంధ్యాసింగ్... గుడ్డు శెట్టితో స్నేహం చేయడం విషయంలో అసంతృప్తితో ఉన్నాడు.
35
శనివారం, అతను ఈ విషయంగా సంధ్యాసింగ్ తో వ్యతిరేకించాడు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఆ సమయంలో గుడ్డు శెట్టి కూడా అక్కడే ఉన్నాడు. మారుతీ హండే తమ స్నేహం విషయంలో అభ్యంతరం చెప్పడం అతనికి కూడా నచ్చలేదు.
45
దీంతో సంధ్యా సింగ్, గుడ్డు శెట్టి అతనిని బ్యాట్, కర్రలతో కొట్టారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వారిద్దరూ అక్కడినుంచి పారిపోయారు.
55
దీనిమీద సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. దీనికి కారణమైన ప్రియురాలిని, ఆమె స్నేహితుడిని మరుసటి రోజే పట్టుకున్నారు. పోలీసుల విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.